Share News

విశాఖ కైలాసగిరిపై భారీ త్రిశూలం ప్రారంభం

ABN , Publish Date - May 09 , 2026 | 09:53 AM

కైలాసగిరిపై ఢమరుకంతో కూడిన భారీ త్రిశూలం ప్రాజెక్ట్ ప్రారంభమైంది. విశాఖ నగరంలో ఎక్కడ నుంచి కైలాసగిరి వైపు చూసిన కనిపించేలా 65 అడుగుల ఎత్తులో త్రిశూలంను ఏర్పాటు చేశారు.

విశాఖ కైలాసగిరిపై భారీ త్రిశూలం ప్రారంభం
Kailasagiri Trishul

విశాఖపట్నం, మే 9: విశాఖ పర్యాటక కేంద్రం కైలాసగిరిపై మరో అద్భుతం ఆవిష్కృమైంది. ఢమరుకంతో కూడిన 65 అడుగుల ఎత్తైన భారీ త్రిశూలం‌ ప్రాజెక్ట్‌ ప్రారంభమైంది. ఈరోజు(శనివారం) ఉదయం మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, విశాఖ ఎంపీ శ్రీభరత్, వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ భారీ త్రిశూలంను ప్రారంభించారు. వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో త్రిశూలం ప్రాజెక్ట్‌ను చేపట్టారు. మూడు కోట్ల రూపాయల వ్యయంతో త్రిశూలం ప్రాజెక్ట్‌ను నిర్మించారు.


విశాఖ నగరంలో ఎక్కడి నుంచి కైలాసగిరి వైపు చూసినా స్పష్టంగా కనిపించేలా 65 అడుగుల ఎత్తున్న త్రిశూలంను ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో కూడా ఆకర్షణీయంగా కనిపించేందుకు 100 వాట్స్ సామర్థ్యం గల 90 ఎల్‌ఈడీ లైట్లను అమర్చారు. ఈ ప్రాజెక్ట్‌ను కేవలం 8 నెలల్లో పూర్తి చేసి ప్రజలు, పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వీఎంఆర్‌డీఏ అధికారులు తెలిపారు. త్రిశూలం ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం చంద్రబాబు

నెల్లూరు జిల్లా సింగనపల్లి వద్ద బస్సు బోల్తా.. పలువురికి గాయాలు..

Read Latest AP News And Telugu News

Updated Date - May 09 , 2026 | 09:59 AM