పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం చంద్రబాబు
ABN , Publish Date - May 09 , 2026 | 08:20 AM
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఈ మేరకు కోల్‌కతా వెళ్లేందుకు బయలుదేరారు.
అమరావతి: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఈ మేరకు కోల్‌కతా వెళ్లేందుకు బయలుదేరారు. ఈరోజు(శనివారం) ఉదయం 7:05 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి విజయవాడ ఎయిర్‌పోర్టుకు హెలికాఫ్టర్‌లో బయలుదేరారు. విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న అనంతరం ఉదయం 7:40 గంటలకు కోల్‌కతాకు విమాన ప్రయాణం చేయనున్నారు. ఉదయం 9:20 గంటలకు కోల్‌కతాలోని నేతాజీ సుభాశ్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు.
అనంతరం బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌కు రోడ్డుమార్గంలో సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనున్నారు. మధ్యాహ్నం 1:45 గంటలకు కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు బయలుదేరుతారు. మధ్యాహ్నం 3:45 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అనంతరం జూబ్లీహిల్స్ నివాసానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. కాగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పెద్దఎత్తున బీజేపీ శ్రేణులు హాజరుకానున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
1000 కోట్లతో పీఎంజేవీకేకు ప్రతిపాదనలు
నెల్లూరు జిల్లా సింగనపల్లి వద్ద బస్సు బోల్తా.. పలువురికి గాయాలు..