1000 కోట్లతో పీఎంజేవీకేకు ప్రతిపాదనలు
ABN , Publish Date - May 09 , 2026 | 05:23 AM
ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమాన్ని (పీఎంజేవీకే) ప్రభుత్వం పట్టాలెక్కించిందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీధర్ తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమాన్ని (పీఎంజేవీకే) ప్రభుత్వం పట్టాలెక్కించిందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. కలెక్టర్ల సదస్సులో మైనార్టీలకు అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. శ్రీధర్ మాట్లాడుతూ పీఎంజేవీకే పథకం కింద ఇప్పటికే 287 కోట్లు ఖర్చు చేశామని, కర్నూలు, కడప, అనంతపురం, గుంటూరు తదితర జిల్లాల్లో ఉర్దూ జూనియర్ కళాశాలలు, వంద పడకల హాస్టళ్లు ఉన్న ఐటీఐలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామని చె ప్పారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి రూ.వెయ్యి కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతున్నామని, ఇందులో ప్రధానంగా క్రీడా ప్రాంగణాలు, సోలార్ పార్కులు, స్కిల్‌డెవల్‌పమెంట్ సెంటర్లు, షాదీఖానాల ను ‘సద్భావనా మండపాలు’గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. జెరూసలేం వెళ్లే యాత్రికులకు 30 నుంచి 60 వేల రూపాయలు సాయం చేసే పథకాన్ని పరిశీలిస్తున్నామన్నారు. మైనార్టీ హాస్టళ్లలో పరిశుభ్రత, క్రమశిక్షణ పెంచడానికి ‘ముస్తాబు’ అనే సరికొత్త కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు.
సింగపూర్‌తో ఒప్పందంపై కమిటీ
పట్టణ ప్రాంతాల్లో సంస్థాగత సామర్థ్యాలను బలోపేతం చేసే దిశ గా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ లక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన సహకారం అందించేందుకు సింగపూర్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని అమలుకు జాయింట్ ఇంప్లిమెంటేషన్ వర్కింగ్ కమిటీని ఏర్పా టు చేస్తూ ప్రణాళిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ లో ఆర్థిక, ప్రణాళిక శాఖల ప్రధాన కార్యదర్శి పీయూష్ కుమార్, ప్రణాళిక శాఖ సంయుక్త కార్యదర్శి అనంత శంకర్, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ ఉన్నారు.
ఎన్‌ఫీల్డ్ ప్రాజెక్టుపై సీఎం స్పందన
రాయలసీమ ఇక ‘రాయల్’ సీమ అంటూ సీఎం ఎక్స్‌లో పోస్టు చేశారు. రాయలసీమకు దూసుకువస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ అన్న క్యాప్షన్‌తో సీఎం చేసిన పోస్టు నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది. తిరుపతిలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు రాయల్ ఎన్‌ఫీల్డ్ రాకను ఉద్దేశించి సీఎం ఈ పోస్టు చేశారు.