Share News

డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్‌ఎస్ మద్దతుపై అద్దంకి దయాకర్ విమర్శలు

ABN , Publish Date - Nov 28 , 2026 | 01:10 PM

దక్షిణ భారత దేశ రాజకీయానికి నష్టం కలిగించే డీలిమిటేషన్ బిల్లును బీజేపీ తీసుకొస్తుంటే.. అందుకు బీఆర్‌ఎస్ మద్దతిస్తోందని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్‌ఎస్ మద్దతుపై అద్దంకి దయాకర్ విమర్శలు
Addanki Dayakar

హైదరాబాద్, నవంబర్ 28: దక్షిణ భారత దేశ రాజకీయానికి నష్టం కలిగించే డీలిమిటేషన్ బిల్లును బీజేపీ తీసుకొస్తుంటే.. అందుకు బీఆర్‌ఎస్ మద్దతిస్తోందని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు (శనివారం) మీడియాతో మాట్లాడుతూ.. ఇక్కడే బీజేపీ, బీఆర్‌ఎస్ చీకటి ఒప్పందం అర్థమవుతోందన్నారు. దక్షణాది రాష్ట్రాలతో పనిలేకుండా నార్త్‌పై డిపెండ్ అయ్యేలా మోదీ ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు.


ఆంధ్రాలో బీజేపీ పొత్తులో ఉన్న టీడీపీ మద్దతు ఇస్తుందంటే అర్థముందని.. కానీ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు మద్దతు ఇస్తున్నారని దయాకర్ ప్రశ్నించారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎందుకు మద్దతిస్తోందని నిలదీశారు. దక్షిణ రాజకీయాలపై కాంగ్రెస్‌కే బాధ్యత ఉందా.. మిగిలిన పార్టీలకు లేదా అని ప్రశ్నించారు. రేపటి రాజకీయ ఒప్పందంలో భాగంగానే పొత్తులాంటి ఎత్తుగడకు బీఆర్‌ఎస్ ప్లాన్ చేసిందని విమర్శించారు.


బేస్ లెస్ రాష్ట్ర సమితిగా బీఆర్‌ఎస్ మారిందని ప్రభుత్వ విప్ వ్యాఖ్యానించారు. డివైడ్ పాలిటిక్స్‌లో భాగంగా బీజేపీ ఇప్పుడు సౌత్, నార్త్‌ను కూడా డివైడ్ చేస్తోందని అన్నారు. ప్రతీది రాజకీయం చేసే బీఆర్‌ఎస్.. ఇప్పుడు సైలెంట్‌గా ఉండేందుకు ఎంతకి అమ్ముడుపోయిందని అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


ఇవి కూడా చదవండి...

పూలే దంపతుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

అండాల సేకరణ వెనుక భారీ నెట్‌వర్క్.. సీపీ సుమతి ఏమన్నారంటే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 28 , 2026 | 01:27 PM