కొమెరపూడిలో ఓటర్లకు బెదిరింపులు.. అప్పు చెల్లించాలంటూ వైసీపీ నేతల హుకుం
ABN , Publish Date - Nov 28 , 2026 | 10:56 AM
పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి మండలం కొమెరపూడిలో ఓటర్లను బెదిరించిన ఘటన కలకలం రేపింది. సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేయాలని ఎస్సీ కాలనీలోని టీడీపీ సానుభూతిపరులకు వైసీపీ నాయకులు హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది.
పల్నాడు జిల్లా, నవంబర్ 28: జిల్లాలోని సత్తెనపల్లి మండలం కొమెరపూడిలో ఓటర్లను బెదిరించిన ఘటన కలకలం రేపింది. సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేయాలని ఎస్సీ కాలనీలోని టీడీపీ సానుభూతిపరులకు వైసీపీ నాయకులు హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి సమయంలో కాలనీకి వెళ్లి ఓటర్లను బెదిరించినట్లు సమాచారం.
వైసీపీ నాయకుడు కళ్లెం నరసింహా రెడ్డి దగ్గర పలువురు ఎస్సీ కాలనీ వాసులు నగదును అప్పుగా తీసుకున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న వైసీపీ శ్రేణులు.. ఆ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేయాలని, లేకపోతే తీసుకున్న అప్పును వడ్డీతో సహా వెంటనే చెల్లించాలని బెదిరింపులకు దిగారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేత అశోక్... వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దాదాపు 10 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
ప్రముఖ విద్యావేత్త మంగాదేవి కన్నుమూత
ప్రతి 100 రోజులకు కొత్త రూపు.. అమరావతి నిర్మాణంపై లోకేశ్ వీడియో
Read Latest AP News And Telugu News