ప్రతి 100 రోజులకు కొత్త రూపు.. అమరావతి నిర్మాణంపై లోకేశ్ వీడియో
ABN , Publish Date - Nov 28 , 2026 | 09:43 AM
అమరావతి నిర్మాణానికి సంబంధించి ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేశ్ చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. అమరావతి నిర్మాణం ముందు.. ఆ తర్వాత అంటూ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.
అమరావతి, నవంబర్ 28: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అక్కడ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. నిన్న జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలోనూ రాజధానిపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం నిర్మాణ పనులకు కోసం రూ.4,688 కోట్ల నుంచి రూ.6,641 కోట్లకు సవరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే వివిధ మౌలిక వసతుల కోసం కూడా నిధులను కేటాయించారు. ఇక తాజాగా అమరావతి నిర్మాణానికి సంబంధించి ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేశ్ చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. అమరావతి నిర్మాణం ముందు.. ఆ తర్వాత అంటూ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.
అమరావతి నిర్మాణ వేగాన్ని మంత్రి నారా లోకేశ్ వీడియో ద్వారా చాటిచెప్పారు. ప్రతి వంద రోజులకు ప్రజా రాజధాని మరో అడుగు ముందుకు సాగుతోందని తెలిపారు. పట్టుదలతో పనిచేసే ప్రభుత్వం, అంకితభావంతో పనిచేసే బృందం ఉంటే ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల వేగాన్ని చూపిస్తూ నాడు - నేడు పేరిట వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రతి వంద రోజులకు అమరావతి సరికొత్త రూపు సంతరించుకుంటోందని.. ప్రజల రాజధాని కల సాకారమవుతోందని #AmaravatiUnstoppable హ్యాష్‌ట్యాగ్‌తో మంత్రి లోకేశ్ సందేశమిచ్చారు.
ఇవి కూడా చదవండి...
సుంకాలపై పునరాలోచన చేయాలి: రిపబ్లికన్లు
ప్రముఖ విద్యావేత్త మంగాదేవి కన్నుమూత
Read Latest AP News And Telugu News