Share News

సీఎం ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం

ABN , Publish Date - Nov 28 , 2026 | 06:58 AM

సీఎం చంద్రబాబు ప్రయాణించేప్రత్యేక విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ పర్యటన కోసం ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన సీఎం...

సీఎం ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం

  • హైదరాబాద్‌ వరకు హెలికాప్టర్‌లో వెళ్లిన సీఎం

అమరావతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు ప్రయాణించేప్రత్యేక విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ పర్యటన కోసం ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన సీఎం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఎప్పుడూ ప్రయాణించే ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే గన్నవరం విమానాశ్రయంలోని ప్రత్యేక విమానంలో సాంతకేతిక సమస్య ఉందని సిబ్బంది గుర్తించారు. అదే విషయాన్ని సీఎంకి తెలపడంతో ఆయన హెలికాప్టర్‌లోనే నేరుగా హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన మరో ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.

ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు

బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..

Updated Date - Nov 28 , 2026 | 07:00 AM