Share News

దుర్గ గుడిలో ప్రసాదాల విక్రయంలో మోసం.. కాంట్రాక్ట్ సిబ్బందిపై ఈవో వేటు

ABN , Publish Date - Nov 28 , 2026 | 10:32 AM

ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కాంట్రాక్ట్ సిబ్బంది చేతి వాటం ప్రదర్శించారు.

దుర్గ గుడిలో ప్రసాదాల విక్రయంలో మోసం.. కాంట్రాక్ట్ సిబ్బందిపై ఈవో వేటు
Durga Temple In Vijayawada

విజయవాడ, నవంబర్ 28: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కాంట్రాక్ట్ సిబ్బంది చేతి వాటం ప్రదర్శించారు. ప్రసాదాల విక్రయంలో కాంట్రాక్ట్ సిబ్బంది మోసానికి పాల్పడ్డంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై దేవాలయం ఈవో శీనా నాయక్‌కు భక్తులు ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే విచారణ చేపట్టారు. నగదు కట్టించుకుని తక్కువ సంఖ్యలో లడ్డూలు ఇస్తున్నట్లు ఈవో నిర్ధారించారు.


ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ సిబ్బందిని సస్పెండ్ చేశారు. సూపర్ వైజర్‌కి షోకాజ్ నోటీసు జారీ చేశారు. దుర్గ గుడిలో ఇంటి దొంగల వ్యవహారంపై అంతర్గత విచారణకు ఈవో ఆదేశించారు. ఇటీవల 500 దర్శనం టిక్కెట్లు రీ సైక్లింగ్ చేసిన ముగ్గురు అవుట్ సోర్సింగ్ సిబ్బందిని ఈవో సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

స్త్రీల సాధికారత కోసం జీవితాంతం కృషి చేసిన పూలే: సీఎం చంద్రబాబు

పది మంది మిమ్మల్ని గుర్తుంచుకోవాలంటే.. చాణక్యుడు చెప్పిన టిప్స్

Updated Date - Nov 28 , 2026 | 10:42 AM