పూలే దంపతుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
ABN , Publish Date - Nov 28 , 2026 | 12:10 PM
మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఘన నివాళులర్పించారు. పూలే దంపతులు కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారన్నారు.
హైదరాబాద్, నవంబర్ 28: మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఘన నివాళులర్పించారు. పూలే దంపతులు కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారన్నారు. మహిళా విద్య కోసం సావిత్రిబాయి పూలే విశేష కృషి చేశారని కొనియాడారు. ఆనాటి పెత్తందారీ వ్యవస్థను ఎదిరించి బాలికల కోసం పాఠశాల ఏర్పాటు చేశారని.. సమానత్వ సమాజమే పూలే దంపతుల ఆశయమని చెప్పుకొచ్చారు. పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో పూలే దంపతుల విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జ్యోతిరావు పూలే ఆలోచనలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమాజానికి పూలే దంపతుల సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. పూలే దంపతుల ఆశయాలు చిరస్మరణీయమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ప్రతి 100 రోజులకు కొత్త రూపు.. అమరావతి నిర్మాణంపై లోకేశ్ వీడియో
హైదరాబాద్‌లో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ హల్‌చల్
Read Latest Telangana News And Telugu News