హైదరాబాద్‌లో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ హల్‌చల్
ABN , Publish Date - Nov 28 , 2026 | 10:13 AM
హైదరాబాద్‌లోని పుప్పాలగూడలో అర్ధరాత్రి ఓ రియల్ ఎస్టేట్ సంస్థ హల్‌చల్ చేసింది. పట్టా భూమిని కబ్జా చేసి రోడ్డు నిర్మాణానికి యత్నించడం కలకలం రేపింది.
హైదరాబాద్, నవంబర్ 28: నగరంలోని పుప్పాలగూడలో అర్ధరాత్రి ఓ రియల్ ఎస్టేట్ సంస్థ హల్‌చల్ చేసింది. పట్టా భూమిని కబ్జా చేసి రోడ్డును నిర్మించేందుకు యత్నించడం కలకలం రేపింది. ఇందుకోసం సీసీ కెమెరాలు ధ్వంసం చేసి మరీ పట్టా భూమిలోకి ప్రవేశించినట్లు పట్టాదారులు ఆరోపించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య రోడ్డు నిర్మాణ పనులను సదరు సంస్థ చేపట్టింది. విషయం తెలిసిన వెంటనే పట్టాదారులు అక్కడకు చేరుకుని ఆ పనులను అడ్డుకున్నారు. పట్టా భూముల్లో రోడ్డు నిర్మాణం చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు.
లారీలు, జేసీబీలకు అడ్డుగా పడుకుని ఆందోళనకు దిగారు. వెంటనే ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పట్టాదారులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు నార్సింగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపట్ల పట్టాదారులు మండిపడ్డారు. అర్ధరాత్రి వేళ రోడ్డు పనులు చేపట్టడంపై పట్టాదారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి...
ప్రముఖ విద్యావేత్త మంగాదేవి కన్నుమూత
ప్రతి 100 రోజులకు కొత్త రూపు.. అమరావతి నిర్మాణంపై లోకేశ్ వీడియో
Read Latest Telangana News And Telugu News