Share News

ఎస్‌ఐ పరీక్షా కేంద్రాల వద్ద ఆంక్షలు

ABN , Publish Date - Nov 28 , 2026 | 09:42 AM

సివిల్‌ ఎస్‌ఐ, సమాన స్థాయి పోస్టుల భర్తీకి ఈ నెల 29న నిర్వహించనున్న పీఆర్‌బీటీ-2026 రాత పరీక్ష నేపథ్యంలో సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు.

ఎస్‌ఐ పరీక్షా కేంద్రాల వద్ద ఆంక్షలు
SI Exam 2026

  • జిరాక్స్‌, ఇంటర్నెట్‌ సెంటర్లు మూసివేయాలని సైబరాబాద్‌ కమిషనర్‌ ఆదేశం

హైదరాబాద్‌ సిటీ: సివిల్‌ ఎస్‌ఐ, సమాన స్థాయి పోస్టుల భర్తీకి ఈ నెల 29న నిర్వహించనున్న పీఆర్‌బీటీ-2026 రాత పరీక్ష నేపథ్యంలో సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మేరకు కమిషనర్‌ డాక్టర్‌ ఎం. రమేశ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 200 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువమంది గుమిగూడటాన్ని నిషేధించారు.


100 మీటర్ల పరిధిలో జిరాక్స్‌, ఫొటోకాపీ, ఇంటర్నెట్‌ సెంటర్‌లను మూసివేయాలని ఆదేశించారు. ఆ రోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. అంత్యక్రియల ఊరేగింపునకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన బంగారం ధర

జనవరి 2నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 28 , 2026 | 09:42 AM