Share News

నంది టీవీ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీ ఏర్పాటు.. ఛైర్మన్‌ ఎవరంటే?

ABN , Publish Date - Nov 28 , 2026 | 11:26 AM

2025 సంవత్సరానికి గాను నంది టీవీ ఫిల్మ్ అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నంది టీవీ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ నియామకంపై సాధారణ పరిపాలన శాఖ జీవో ఆర్టీ నంబర్ 2210‌ను జారీ చేసింది.

నంది టీవీ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీ ఏర్పాటు.. ఛైర్మన్‌ ఎవరంటే?
Nandi TV Film Awards

అమరావతి, నవంబర్ 28: 2025 సంవత్సరానికి గాను నంది టీవీ ఫిల్మ్ అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నంది టీవీ ఫిల్మ్ అవార్డుల (2025) జ్యూరీ నియామకంపై సాధారణ పరిపాలన (సమాచార, పౌర సంబంధాల) శాఖ జీవో ఆర్టీ నంబర్ 2210‌ను జారీ చేసింది. మొత్తం 13 మందితో కూడిన నంది టీవీ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. నంది టీవీ ఫిల్మ్ అవార్డుల (2025) జ్యూరీ కమిటీ ఛైర్మన్‌గా కొమ్మనాపల్లి గణపతిరావును నియమించారు.


అలాగే జ్యూరీ సభ్యులుగా రూప దేవి, కోట శంకరరావు, సుబ్బరాయ శర్మ, ఉదయభాను నియామకం జరిగింది. వీరితో పాటు అనితా చౌదరి, సనా, కె.వి.ఎస్. దుర్గలను జ్యూరీ సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. జ్యూరీ కమిటీ సభ్యుడు/కన్వీనర్‌గా ఏపీ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థ (APSFTVTDC) మేనేజింగ్ డైరెక్టర్‌ను నియమిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. నంది టీవీ ఫిల్మ్ అవార్డుల ఎంపికకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని విజయవాడలోని ఏపీఎస్‌ఎఫ్‌టీవీడీసీ ఎండీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


ఇవి కూడా చదవండి...

ప్రతి 100 రోజులకు కొత్త రూపు.. అమరావతి నిర్మాణంపై లోకేశ్ వీడియో

కొమెరపూడిలో ఓటర్లకు బెదిరింపులు.. అప్పు చెల్లించాలంటూ వైసీపీ నేతల హుకుం

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 28 , 2026 | 12:10 PM