బండ్లగూడ ఆర్టీవో ఆఫీసులో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు.. ముగ్గురు అధికారులపై సస్పెన్షన్ వేటు
ABN , Publish Date - Sep 21 , 2026 | 06:05 PM
బండ్లగూడ ఆర్టీవో ఆఫీసులో ఏసీబీ అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆర్టీవో అధికారులపై ఆయా వాహనదారుల నుంచి పలు ఫిర్యాదులు అందడంతో ఏసీబీ రంగంలోకి దిగినట్లు సమాచారం.
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (ఆంధ్రజ్యోతి): బండ్లగూడ ఆర్టీవో ఆఫీసులో ఏసీబీ అధికారులు ఈరోజు (సోమవారం) ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆర్టీవో అధికారులపై ఆయా వాహనదారుల నుంచి పలు ఫిర్యాదులు అందడంతో ఏసీబీ రంగంలోకి దిగినట్లు సమాచారం. తమ దగ్గర సరైన కాగితాలు ఉన్నా ఆర్టీవో కార్యాలయం చుట్టూరా తిప్పుకుంటున్నారని వాహనదారులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, కానిస్టేబుల్ అరుణ్ కార్యాలయంలోని చాంబర్‌లో నగదు లెక్కిస్తున్న వీడియో దృశ్యాలు రికార్డయ్యాయి.
నగదు లెక్కిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారుల సోదాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆర్టీవో అధికారులను ఏసీబీ బృందం ప్రశ్నిస్తోంది. ఆర్టీవో కార్యాలయంలో గంటకు పైగానే సోదాలు కొనసాగుతున్నాయని సమాచారం. ఏసీబీ అధికారులు ఆయా ఫైళ్లను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తనిఖీలు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ముగ్గురు అధికారులపై రవాణా శాఖ కమిషనర్ సస్పెన్షన్ వేటు..
బండ్లగూడ ఆర్టీవో ఘటనలో ముగ్గురు అధికారులపై రవాణా శాఖ కమిషనర్ సస్పెన్షన్ వేటు వేశారు. MVI భీమ్ సింగ్, ఆర్టీవో రామచందర్, కానిస్టేబుల్ అరుణ్‌లపై చర్యలు తీసుకున్నారు. నగదు లెక్కింపు వీడియో వైరల్ కావడంతో రవాణా శాఖ కమిషనర్ సీరియస్ అయ్యారు. ఏసీబీ సోదాల అనంతరం రవాణా శాఖ ఉన్నతాధికారుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఖైరతాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు రాజకీయ నిమజ్జనం ఖాయం: బండి సంజయ్
కేసీఆర్, రేవంత్ నయా నిజాంలు.. ఎంపీ రఘునందన్ రావు సెటైర్లు
మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News