హైదరాబాద్‌లో హైటెక్ చోరీ.. ఆరుగంటల్లోనే రూ.7.80 కోట్ల మాయం!
ABN , Publish Date - Nov 04 , 2026 | 08:27 PM
హైదరాబాద్‌లో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో సైబర్ నేరగాళ్లు భారీ చోరీకి పాల్పడ్డారు. కేవలం ఆరు గంటల్లోనే రూ.7.80 కోట్లు స్వాహా చేశారు. ఫైనాన్స్ సంస్థ కార్పొరేట్ బ్యాంక్ ఖాతా నుంచి నగదును దోచేశారు.
హైదరాబాద్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో సైబర్ నేరగాళ్లు భారీ చోరీకి పాల్పడ్డారు. కేవలం ఆరు గంటల్లోనే రూ.7.80 కోట్లు స్వాహా చేశారు. ఓ ఫైనాన్స్ సంస్థ కార్పొరేట్ బ్యాంకు ఖాతా నుంచి నగదును దోచేశారు. ఏకంగా 83 బ్యాంకు ఖాతాల్లోకి ఈ నగదును బదిలీ చేశారు. నవంబరు 1వ తేదీన ఉదయం 10:18 గంటలకు నగదు బదిలీలు ప్రారంభమయ్యాయి. ఆరోజు సాయంత్రం 4:58 గంటల వరకు కొనసాగిన సైబర్ దోపిడీ.. చివరి లావాదేవీతో మొత్తం రూ.7.80 కోట్లను సైబర్ కేటుగాళ్లు కొట్టేశారు.
భారీ నగదు మాయం కావడంతో ఫైనాన్స్ సంస్థ యాజమాన్యం ఆందోళనలో ఉంది. ఈ మోసంపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఆ సంస్థ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించి సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కేసు నమోదు చేసి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. 83 బ్యాంకు ఖాతాల్లోకి వెళ్లిన నగదుపై అధికారులు విచారిస్తున్నారు. ఆరు గంటల్లోనే రూ.7.80 కోట్ల దోపిడీ చేసిన సైబర్ నేరగాళ్ల కోసం పోలీసులు చర్యలు చేపట్టరు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్ హయాంలో తెలంగాణ సొత్తును కొల్లగొట్టారు.. మంత్రి పొంగులేటి ధ్వజం
సైబర్ నేరాల నియంత్రణకు జాతీయ స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ: డీజీపీ ఆనంద్
బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండేలా ‘సర్’ను వాడుతోంది.. ఎంపీ చామల ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News