Share News

ఐపీఎల్‌ మ్యాచ్‌ కోసం 3వేల మంది పోలీసులతో బందోబస్తు

ABN , Publish Date - Apr 04 , 2026 | 08:39 AM

ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణ సందర్భంగా ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియాన్ని ఇన్‌చార్జి సీపీ సుధీర్‌బాబు శుక్రవారం సందర్శించారు.

ఐపీఎల్‌ మ్యాచ్‌ కోసం 3వేల మంది పోలీసులతో బందోబస్తు

హైదరాబాద్‌ సిటీ: ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణ సందర్భంగా ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియాన్ని ఇన్‌చార్జి సీపీ సుధీర్‌బాబు శుక్రవారం సందర్శించారు. ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్‌ నిర్వహణతోపాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్పెషల్‌ బ్రాంచ్‌, అక్టోపస్‌, క్రైం, షీటీమ్స్‌, ఐటీ విభాగాలు కలిపి 3 వేల మందితో బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. స్టేడియం లోపల, బయట 450 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని,


city3.2.jpgదీని కోసం ప్రత్యేక మినీ కమాండ్‌ కంట్రోల్‌ రూము ఏర్పాటు చేశామని చెప్పారు. స్టేడియం పరిసరాల్లో భారీ వాహనాలు, ఇతర వాహనాలు రాకుండా ఆంక్షలు అమలు చేస్తున్నామన్నారు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత ప్రేక్షకుల సులభ రవాణా కోసం మెట్రో సేవల వేళలను అర్ధరాత్రి వరకు పొడిగించాలని మెట్రో అధికారులను కోరారు. ఆయన వెంట డీసీపీలు, ఏసీపీలు ఇతర అధికారులు ఉన్నారు.


city3.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి:

స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

పాత పేరు.. కొత్త అజెండా!

Read Latest Telangana News and National News

Updated Date - Apr 04 , 2026 | 08:56 AM