Share News

48 గంటల కాల్పుల విరమణ.. అమెరికా ప్రతిపాదనను తిరస్కరించిన ఇరాన్..

ABN , Publish Date - Apr 04 , 2026 | 07:23 AM

ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో 48 గంటల కాల్పుల విరమణ కోసం అమెరికా చేసిన ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించిందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో టెహ్రాన్ వైఖరి మరింత కఠినంగా మారుతోందనడానికి ఈ తిరస్కరణ ఓ నిదర్శనంగా కనబడుతోంది.

48 గంటల కాల్పుల విరమణ.. అమెరికా ప్రతిపాదనను తిరస్కరించిన ఇరాన్..
Iran US ceasefire

ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో 48 గంటల కాల్పుల విరమణ కోసం అమెరికా చేసిన ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించిందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో టెహ్రాన్ వైఖరి మరింత కఠినంగా మారుతోందనడానికి ఈ తిరస్కరణ ఓ నిదర్శనంగా కనబడుతోంది. బుధవారం ఒక మధ్యవర్తి దేశం ద్వారా ఇరాన్‌కు అమెరికా ఈ సందేశం పంపినట్టు సమాచారం (Iran US ceasefire).


ఈ దౌత్య ప్రయత్నాలు విఫలం అయిన వెంటనే సైనిక ఘర్షణలు మరింత తీవ్రం అయ్యాయని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన రెండు అత్యాధునిక ఫైటర్ జెట్‌లను కూల్చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. ఇక, ఇరాన్‌లోని మౌలిక వసతులపై అమెరికా భీకర దాడులు చేసింది. ప్రస్తుత ఘర్షణల సమయంలో ఇరాన్ గగనతలంపై ఒక అమెరికా విమానం కూలిపోవడం ఇదే మొదటిసారి. అమెరికాకు చెందిన ఎఫ్-15 యుద్ధ విమానానికి చెందిన ఫొటోలను ఇరాన్ మీడియా విడుదల చేసింది (48-hour ceasefire rejected).


ఆ శిథిలాలు ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ ఫైటర్ జెట్ విమానానికి చెందినవేనని అమెరికా మీడియా తేల్చింది (Middle East tensions 2026). గత 24 గంటల్లో ఇది రెండోదని, మొత్తంగా మూడో ఎఫ్‌-35ని అమెరికా నష్టపోయిందని ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ పేర్కొంది. కూలిపోయిన యుద్ధ విమానం శకలాలను, పైలట్లను గుర్తించేందుకు అమెరికా బ్లాక్‌ హాక్‌ హెలికాప్టర్‌, సీ-130 హెర్క్యులస్‌ విమానాలతో గాలింపు చేపట్టింది. ఈ క్రమంలో వాటిపైనా ఇరాన్‌ డ్రోన్లు, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ క్షిపణులను ప్రయోగించింది.


ఈ వార్తలు కూడా చదవండి:

స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

పాత పేరు.. కొత్త అజెండా!

Updated Date - Apr 04 , 2026 | 07:23 AM