Share News

బాలికపై ఆటో డ్రైవర్ల అత్యాచారం.. ‘పోక్సో’ కేసు నమోదు

ABN , Publish Date - Sep 03 , 2026 | 06:17 PM

పదిహేనేళ్ల బాలికపై ఇద్దరు ఆటో డ్రైవర్లు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని చంద్రాయణగుట్టలో జరిగింది.

బాలికపై ఆటో డ్రైవర్ల అత్యాచారం.. ‘పోక్సో’ కేసు నమోదు

హైదరాబాద్, సెప్టెంబర్ 3: నగరంలోని చంద్రాయణగుట్టకు చెందిన ఓ బాలికపై ఇద్దరు ఆటో డ్రైవర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 15 ఏళ్ల బాలిక కూలి పనికి వెళ్తుండగా.. అటుగా వెళ్తున్న ఇద్దరు ఆటో డ్రైవర్లు ఆమెను బలవంతంగా ఆటో ఎక్కించుకున్నారు. ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.


ఈ ఘటనకు సంబంధించి నిందితులు అహ్మద్, అస్లామ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు మైనర్ కావడంతో ఇద్దరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యా్ప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు సేకరించేందుకు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.


ఇవీ చదవండి:

కాంగ్రెస్ లక్ష్మణ రేఖ దాటితే ఎవ్వరిపైనైనా చర్యలు ఉంటాయి: మల్లు రవి

ఉరిశిక్ష పడిన వ్యక్తికీ చివరిసారిగా చెప్పుకునే అవకాశం ఇస్తారు: కొండా సురేఖ

Updated Date - Sep 03 , 2026 | 06:17 PM