గోదావరి పుష్కరాల పనుల నాణ్యతలో రాజీపడొద్దు.. అధికారులకు మంత్రి అడ్లూరి ఆదేశాలు
ABN , Publish Date - Nov 06 , 2026 | 04:01 PM
గోదావరి పుష్కరాల పనుల్లో జాప్యానికి తావు ఇవ్వవద్దని తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. అధికారులను ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆజ్ఞాపించారు.
హైదరాబాద్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): గోదావరి పుష్కరాల పనుల్లో జాప్యానికి తావు ఇవ్వవద్దని తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Telangana Minister Adluri Lakshman Kumar).. అధికారులను ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆజ్ఞాపించారు. పుష్కరాలకు వచ్చే లక్షలాది భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని సూచించారు. ధర్మపురి, కోటిలింగాల అభివృద్ధి పనులపై మంత్రి ఈరోజు (శుక్రవారం) రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.
ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి..
గోదావరి పుష్కరాల పనుల నాణ్యతలో రాజీపడొద్దని మంత్రి అడ్లూరి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా శాఖల మధ్య సమన్వయంతో పనులు వేగవంతం చేయాలని మార్గనిర్దేశం చేశారు. ఘాట్లు, రహదారులు, పార్కింగ్, తాగునీరు, వైద్య సదుపాయాలను కల్పించాలని సూచించారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు. గోదావరి పుష్కరాల కోసం రాష్ట్రవ్యాప్తంగా రూ.1,000 కోట్లను కేటాయించినట్లు ప్రకటించారు. ధర్మపురి అభివృద్ధికి సుమారు రూ.226 కోట్లతో ఆయా పనులకు ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. ధర్మపురిలో 470 మీటర్ల మేర కొత్త స్నాన ఘాట్ల అభివృద్ధి ప్రతిపాదనలు చేస్తున్నామని వివరించారు. 2027 జూన్ 26వ తేదీ నుంచి జులై 7వ తేదీ వరకు గోదావరి పుష్కరాలు జరుగుతాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News