తగ్గిన వర్షపాతం.. పెరిగిన బొగ్గు ఉత్పత్తి
ABN , Publish Date - Sep 08 , 2026 | 12:03 PM
ఎల్‌నినో సింగరేణికి అనుకూలంగా మారింది. వర్షాభావ పరిస్థితులు బొగ్గు ఉత్పత్తికి కలిసొచ్చాయి.
అనుకూలంగా మారిన వర్షాభావ పరిస్థితులు
లక్ష్య సాధన వైపు వేగంగా అడుగులు
రెబ్బెన(మంచిర్యాల): ఎల్‌నినో సింగరేణికి అనుకూలంగా మారింది. వర్షాభావ పరిస్థితులు బొగ్గు ఉత్పత్తికి కలిసొచ్చాయి. బెల్లంపల్లి ఏరియాలోని కైరిగూడ ఓసీపీ గతేడాదితో పోలిస్తే అధికఉత్పత్తి సాధించి లక్ష్యసాధన వైపు దూసుకుపోతోంది. ఈనెల ఉత్పత్తి ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. ఏరియాకు ఈ ఓసీపీనే పెద్ద దిక్కుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టువరకు బెల్లంపల్లి ఏరియాలో 11,74,504 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేపడితే ఈసారి మాత్రం 14,06,446మెట్రిక్‌టన్నుల ఉత్పత్తి సాధ్యమైంది.
ఉత్పత్తి పెరిగింది..
శ్రీ రమేష్, జీఎం, బెల్లంపల్లి ఏరియా
ఈసారి వర్షాలు తక్కు వగా ఉండటంతో బొగ్గు ఉత్పత్తి పెరిగింది. ఆగస్టు వరకు బెల్లంపల్లి ఏరియా 118శాతం ఉత్పాత కతతో కొనసాగుతోంది. ఈ మూడునెలల పరిస్థితులు కాస్తఅనుకూలంగా ఉండటంతో బొగ్గు ఉత్పత్తి చేపట్టగలిగాం. తక్కువ వర్షపాతంతో ఉత్పత్తి పెరుగటంతో నిర్ణీత సమయం కంటే ముందే వార్షికలక్ష్యాన్ని సాధించేందుకు అవకాశం ఏర్పడింది.
ఈ వార్తలు కూడా చదవండి:
ఒకటే కార్డు.. మెట్రో, బస్సుల్లో రయ్ రయ్!
Read Latest AP News And Telangana News And International News And Telugu News