కేర్ టేకర్ కాలు పట్టుకున్న మొసలి.. ఓ గంట తర్వాత..
ABN , Publish Date - Sep 08 , 2026 | 11:19 AM
మొసలికి చికెన్ తినిపిస్తుండగా ఓ కేర్ టేకర్ ప్రమాదానికి గురయ్యాడు. మొసలి ఆ కేర్ టేకర్ కాలు పట్టుకుని నీటిలోకి లాక్కుపోయింది. అతడిని చంపి తినడానికి ప్రయత్నించింది. కేర్ టేకర్‌ను కాపాడ్డం కోసం పోలీసులు మొసలిని చంపకతప్పలేదు.
ఇంటర్‌నెట్ డెస్క్: మొసలికి చికెన్ తినిపిస్తుండగా ఓ కేర్ టేకర్ ప్రమాదానికి గురయ్యాడు. మొసలి ఆ కేర్ టేకర్ కాలు పట్టుకుని నీటిలోకి లాక్కుపోయింది. అతడిని చంపి తినడానికి ప్రయత్నించింది. కేర్ టేకర్‌ను కాపాడ్డం కోసం పోలీసులు మొసలిని చంపకతప్పలేదు. అయితే, ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కేర్ టేకర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ సంఘటన న్యూగినియాలో శనివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
శనివారం పపువాలోని అడ్వంచర్ పార్క్‌లో ఓ కేర్ టేకర్ కొలనులోని మొసలికి చికెన్ తినిపించడానికి వెళ్లాడు. చికెన్ పెడుతున్న సమయంలో ఆ మొసలి కేర్ టేకర్ కాలును పట్టుకుంది. అతడిని నీటిలోకి లాక్కుపోవడానికి ప్రయత్నించింది. కేర్ టేకర్ వెంటనే కొలను గట్టును పట్టుకున్నాడు. సాయం కోసం గట్టిగా కేకలు వేయటం మొదలెట్టాడు. అతడి అరుపులు విని తోటి సిబ్బంది వెంటనే అక్కడికి వచ్చారు. మొసలి నోటినుంచి అతడిని బయటకు లాగడానికి తీవ్రంగా ప్రయత్నించారు.
ఎంత ప్రయత్నించినా మొసలి కేర్ టేకర్‌ను వదల్లేదు. సమాచారం అందుకున్న అంబులెన్స్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మొసలి ఎంతకీ అతడిని వదిలిపెట్టకపోవటంతో పోలీసులు దాన్ని కాల్చి చంపారు. కేర్ టేకర్‌ను అంబులెన్స్‌లో త్రీ మైల్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం అతడు చనిపోయాడు. మొసలి కేర్ టేకర్‌ను నోట పట్టుకున్న దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
డ్యూటీలో ఉన్న పోలీసులను కొట్టిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి: మంత్రి సీతక్క