డీజే దరువు.. గుండెల్లో బరువు
ABN , Publish Date - Sep 22 , 2026 | 12:10 PM
సందర్భం ఏదైనా... శబ్దాలమోత ఇప్పుడు ష్యాషన్‌గా మారింది. అందులో ప్రధానంగా డీజే బాక్స్‌లు సర్వసాధారణమవుతున్నాయి.
మితిమీరిన శబ్దం ఆరోగ్యానికి హానికరం
వేడుకలు, ఫంక్షన్లలో తప్పనిరిగా మారిన తంతు
అనుమతి లేకుంటే కేసులు తప్పవు
వాంకిడి(మంచిర్యాల): సందర్భం ఏదైనా... శబ్దాలమోత ఇప్పుడు ష్యాషన్‌గా మారింది. అందులో ప్రధానంగా డీజే బాక్స్‌లు సర్వసాధారణమవుతున్నాయి. రాజకీయ, సామాజిక వర్గాల ప్రదర్శనలు దగ్గరి నుంచి మొదలుకుని వివాహ శుభకార్యాల బరాత్ (ఊరేగింపు), దైవ విగ్రహాల ప్రదర్శన వరకు ఎక్కడ చూసినా డీజే శబ్దాలు మోత మోగిపోతున్నాయి. మితిమీరిన శబ్దం గుండేలయ తప్పించే ప్రమాద ముంది. డీజే శబ్దాలతో వృద్ధులు, పిల్లలతో పాటు యువతా బలవుతున్నారు. హుషారు గా నృత్యం చేస్తున్న యువకులు ఉన్నట్లుండి కుప్పకూలుతున్నారు. అధిక శబ్దాలతో గర్భంలోని శిశువులపై కూడా దుష్ప్రభావం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆప్ లేబర్ ఇండస్ట్రీ యాక్టు ప్రకారం పాటించాల్సిన నిబంధ నలు అమలుకు నోచుకోవడంలేదు.
ప్రారంభం నుంచే..
డీజే శబ్దం ప్రారంభం నుంచే 100 డిసెబుల్స్ ఉంటుంది. సాధారణంగా చెవి వినికిడి సామర్థ్యం కంటే అదనంగా 20 డెసిబుల్స్‌తోనే ప్రారంభం అవుతుంది. 130 డిసెబుల్స్‌కి మించి అంతకంటే ఎక్కువైతే వినికిడిని పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డీజే సౌండ్స్ గంటల కొద్ది వినడం వల్ల కొంత మందికి తాత్కాలి కంగా చెవుడు ప్రారంభమై కొన్ని రోజులకు సాధారణస్థితికి విని కిడి సమస్య వచ్చే అవకాశాలుంటాయి.
130 డిసెబు ల్స్ కంటే ఎక్కువ శబ్దాన్ని ఎక్కువ సమయం వింటే చెవిలో ఉండే చిన్న చిన్న హియరింగ్ సెల్స్ చని పోయి శాశ్వతంగా చెలి వినికిడి సామర్థ్యాన్ని కోల్పో వాల్సి వస్తుంది. ఒకేసారి చెవి సామర్థ్యానికి మించిన శబ్దం వింటే టసాస్టిక్ ట్రామా బారిన పడాల్సి వస్తుం ది. మొదడులో స్ట్రెస్ హార్మోన్స్ పెరిగి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే అవకాశాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. శబ్దం తీవ్రత పెరుగుదల వల్ల ఎండోసి లియల్ సెల్స్ దెబ్బతిని దీర్ణకాలంలో గుండెపోటు సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. గుండె సంబంఽధి త సమస్యలున్న వారికి డీజే శబ్దం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
కేసులు నమోదు ఇలా...
పోలీసుల అనుమతి తీసుకోకుండా డీజేలు ఉప యోగిస్తే కేసులు నమోదు చేస్తారు. న్యూసెన్స్ లేదా శబ్ద కాలుష్య కింద కేసులు నమోదు చేసి ఆయా వాహనాలతో పాటు డీజే కోసం ఉపయోగించిన అన్ని వస్తువులను సీజ్ చేస్తారు. తర్వాత బాధితులు కోర్టుకు వెళ్లి జరిమానా చెల్లించి తిరిగి వాహనం తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతి తీసుకొని కూడా సమయపాలన పాటించకుండా డీజే వినియోగిస్తే కూడా కేసులు నమోదు చేస్తారు. కోర్టులో రూ. 500 నుంచి రూ. 1000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది.
నిబంధనలు ఇలా..
నిబంధల ప్రకారం 70 డిసిబుల్స్ సౌండ్ వరకే పరిమితి ఉంది. అంతకు మించితే చట్ట రీత్య నేరం. రాత్రి 10 నుంచి ఉదయం 6 మధ్య భారీశబ్దాలతో ఎలాంటి వేడుకలు, ఊరే గింపులు చేయకూడదు. ఆస్పత్రులు, పాఠశాలలు, కోర్టులను నిశబ్ద జోన్లుగా పరిగణిస్తారు. అధి కార యంత్రాంగం అమలుకు చర్యలు చేపడుతన్నప్పటికి ప్రజా ప్రతి నిధులు, రాజకీయ శ్రేణులు, వివిధ సంఘాల ఒత్తిడులతో ముందడుగు వేయడంలేదు.
సాధారణంగా 70 డెసిబుల్స్ శబ్దాలను వినడానికి మానవుల చెరవులు సహకరిస్తాయి. 70-85 డెసిబుల్స్ వరకు శబ్దాన్ని ఏడు ననుంచి ఎనిమితి గంటలు, 90 డెసిబుల్స్ వరకు నాలుగు గంటల పాటువినవచ్చు. డీజే శబ్దం 200 డెసిబుల్స్ పైనే ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకరం. భారీ సౌండ్ ప్రకంపనలకు చెవుల్లో సున్నిత కణాలు దెబ్బతింటాయి. కర్ణభేరి దెబ్బతిని శాశ్వత వినికిడి లోపానికి దారి తీస్తుంది. గుండె జబ్బులు ఉన్న వారికి తీవ్ర ప్రభావం చూపుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
శుక్రవారం మధ్యాహ్నం లోపే ఖైరతాబాద్ గణపయ్య నిమజ్జనం
యువ వికాసంపై చిగురిస్తున్న ఆశలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News