Share News

బాసర మహంకాళి ఆలయ చోరీ.. హోంగార్డుల సరెండర్

ABN , Publish Date - Jun 24 , 2026 | 08:11 AM

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలోని మహంకాళి ఆలయంలో జరిగిన చోరీ ఘటనలో దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఉన్నతాధికారులు, నిందితులను పట్టుకునేందుకు 6 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టారు.

బాసర మహంకాళి ఆలయ చోరీ.. హోంగార్డుల సరెండర్
Basara Mahankali Temple theft

నిర్మల్ జిల్లా, జూన్, 24 (ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలోని మహంకాళి ఆలయంలో జరిగిన చోరీ ఘటనలో దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఉన్నతాధికారులు, నిందితులను పట్టుకునేందుకు 6 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టారు.


హోంగార్డుల సరెండర్..

మరోవైపు ఆలయ భద్రతలో అలసత్వం వహించిన వారిపై ఆలయ యంత్రాంగం కఠిన చర్యలు ప్రారంభించింది. బాసర ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు హోంగార్డులను ఆలయ కార్యనిర్వహణాధికారి అంజనీదేవి సరెండర్ చేశారు.


ఎస్పీకి ఈవో లేఖ..

ఆలయంలో చోరీ జరిగిన సమయంలో లేదా విధుల్లో ఉన్న సమయంలో ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా, బాధ్యతారహితంగా విధులకు గైర్హాజరైన హోంగార్డులపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ నిర్మల్ జిల్లా ఎస్పీకి ఈవో అంజనీదేవి లేఖ రాశారు. ఆలయ భద్రతా లోపాలు, సిబ్బంది గైర్హాజరుపై నిఘా పెట్టిన పోలీసులు, అన్ని కోణాల్లోనూ దర్యాప్తును వేగవంతం చేశారు. ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను కూడా ప్రత్యేక బృందాలు పరిశీలిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి...

అసెంబ్లీలో సీఎం విజయ్ గర్జన.. డీఎంకేకి స్ట్రాంగ్ కౌంటర్

పేదల ఇళ్లు కూలిస్తే ఊరుకోం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 24 , 2026 | 08:15 AM