మోదీని రావణుడితో పోల్చిన దుర్మార్గపు సీఎం రేవంత్
ABN , Publish Date - Nov 04 , 2026 | 04:43 AM
దేశం కోసం, ధర్మం కోసం, పేదల కోసం పరితపించే మహారుషి ప్రధాని మోదీ అని, అలాంటి గొప్ప వ్యక్తిని రావణుడితో పోల్చిన దుర్మార్గపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు.
ఫాంహౌస్‌లో మందు సోడా కలిపే సంస్కృతీ మాది కాదు
కేంద్ర మంత్రి బడి సంజయ్
నిర్మల్/న్యూఢిల్లీ, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): దేశం కోసం, ధర్మం కోసం, పేదల కోసం పరితపించే మహారుషి ప్రధాని మోదీ అని, అలాంటి గొప్ప వ్యక్తిని రావణుడితో పోల్చిన దుర్మార్గపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. తమ పార్టీ ఢిల్లీకి మూట లు మోసే పార్టీ కాదని, ఫాంహౌస్‌లో గ్లాసులో మందు, సోడా కలిపే సంస్కృతీ తమది కాదని వ్యాఖ్యానించారు. తమది దేశాన్ని రక్షించే పార్టీ అని అన్నారు. మంగళవారం బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్మల్‌లో నిర్వహించిన మహా పాదయాత్ర సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు.
మనదేశ పౌరులే మన ప్రధానిని నిర్ణయించాలని, పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్ వంటి దేశాల వ్యక్తులు వచ్చి నిర్ణయిస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీలను కాంగ్రెస్ వ్యతిరేకించిందని చెబుతూ పరాయి దేశస్థులకు భారత్‌లో ఓటు హక్కు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. ఇలాగే మొరిగితే త్వరలో ఎన్‌ఆర్‌సీ కూడా పట్టుకొస్తామని, పరాయి దేశస్థులను తరిమి కొడతామని హెచ్చరించారు. తనను, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నవారిపై సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారెక్కడున్నా వదిలిపెట్టమని, వారి బట్టలూడదీసి కొడతామని హెచ్చరించారు.
కాంగ్రెస్ పునాదులు కదిలాయి: రఘునందన్
కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాదయాత్రతో తెలంగాణలో కాంగ్రెస్ పునాదులు కదిలాయని, అందువల్లే పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడు తూ.. రాష్ట్ర విభజన హామీల మీద సోయి ఉంటే గత 12 ఏళ్లుగా మహేశ్ గౌడ్ ఏమీ చేశారో చెప్పాలని, వాటిపై జంతర్ మంతర్‌లో ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ప్రజలకు తాగేందుకు నీళ్లు కూడా లేని పరిస్థితిని రేవంత్ ప్రభుత్వం కల్పించిందని ఆయన ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే ‘అడిగినంత’ జీతం
ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు
Read Latest AP News And Telangana News And International News And Telugu News