ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు చిన్నారుల మృతి
ABN , Publish Date - Sep 22 , 2026 | 06:27 AM
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు.
ఆదిలాబాద్, సెప్టెంబర్ 22 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో నిన్న (సోమవారం) అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. మరో ఐదుగురు చిన్నారుల పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ముగ్గురు, నిజామాబాద్‌కు ఇద్దరిని తరలించి చికిత్స అందిస్తున్నారు. రిమ్స్ ఆస్పత్రిలోని నవజాత శిశువుల ప్రత్యేక రక్షణ వార్డులో (SNCU ) షార్ట్ సర్క్యూ ట్ కారణంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఏసీ పేలి పోవడంతో ఈ వార్డులో భారీగా మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందగానే ఫైర్ సిబ్బంది హుటాహుటినా ఆస్పత్రికి చేరుకుని మంటలను అదుపు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు వార్డులో 27 మంది చిన్నారులు ఉన్నారు. మంటలు, పొగతో పలువురు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. చిన్నారులకు వైద్య చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చిన్నారులకు మెరుగైన వైద్యం అందించేలా ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్, ఎస్పీ
రిమ్స్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఆస్పత్రికి కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ చేరుకున్నారు. ఈ ఘటనకు గల కారణాలను ఆస్పత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంపై సిబ్బందిని కలెక్టర్, ఎస్పీ అప్రమత్తం చేశారు. మిగతా చిన్నారులకు మెరుగైన వైద్యం అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
22A భూముల వ్యవహారం.. తెలంగాణ ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు
తెలంగాణలో డిసెంబర్ 11 నుంచి 23 వరకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026: మంత్రి వాకిటి శ్రీహరి
ప్రతి గ్రామపంచాయతీని మోడల్‌గా తీర్చిదిద్దాలి: మంత్రి సీతక్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News