జీమెయిల్‌లో సరికొత్త ఏఐ ఫీచర్లు.. మాట్లాడితే పనైపోతుందంతే..
ABN , Publish Date - Sep 04 , 2026 | 07:07 PM
ఇంతింతై.. వటుడింతై అన్నట్లు ప్రతి చోటా వ్యాపించేస్తోంది ఏఐ. ఇప్పుడు జీమెయిల్‌లో కూడా ఏఐ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో చూద్దాం రండి.!
ఇంటర్నెట్ డెస్క్: జీమెయిల్‌లో సరికొత్త ఏఐ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది గూగుల్. ఇకపై కేవలం మాటలతోనే జీమెయిల్, డాక్స్, కీప్ లాంటి గూగుల్ యాప్స్‌ను ఉపయోగించుకోవచ్చు. అంటే ఒక్క వాయిస్‌తో ఈమెయిల్స్‌ను వెతుక్కోవడం, డాక్యుమెంట్స్ క్రియేషన్ వంటి పనులు భేషూగ్గా చేసుకోవచ్చు. ఏమీ టైప్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ యాప్‌లను ఇట్టే వాడుకోవచ్చు. ఇదంతా జెమిని ఏఐ వల్ల సాధ్యపడుతుంది. ‘కొత్త జెమిని వాయిస్ ఫీచర్లు మీకు ఎంతో ఉపయోగపడతాయి. మీ ఇన్‌బాక్స్‌లో మెయిల్స్‌ను ఇవి వెతుకుతాయి. అలా ఏఐ-సబ్‌స్క్రైబర్లకు ఎన్నో పనులు చేసి పెడతాయి’ అని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఎలా ఉపయోగపడతాయంటే.?
ఈ ఫీచర్లలో బాగా ఉపయోగపడేది గూగుల్ లైవ్. దీని వల్ల ఈమెయిల్స్ వెతుక్కోవడం చాలా సులభం. ఇన్‌బాక్స్‌లో వందల్లో ఈమెయిల్స్ ఉన్నా కావాల్సిన సమాచారాన్ని వేగంగా పొందొచ్చు. ఉదాహరణకు ఓ ఇంటర్వ్యూ గురించి సమాచారం కావాలంటే అదేపనిగా మెయిల్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫలానా ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడు అని అడిగితే ఏఐ ఇట్టే చెప్పేస్తుంది. అలాగే ఇంటర్వ్యూ లోకేషన్ గురించిన అనుమానాలున్నా నివృతి చేస్తుంది. మెయిల్స్ అన్నీ చదవి కావాల్సిన సమాచారమందిస్తుంది.
గూగుల్ ఇస్తున్న మరో ఫీచర్ డాక్స్ లైవ్. దీన్ని ఉపయోగించి ఎలాంటి డాక్యుమెంట్ అయినా మాట్లాడి తయారు చేసుకోవచ్చు. కీప్ లైవ్ ఫీచర్‌తో నోట్స్‌ను సులభంగా రాసుకోవచ్చు. అయితే ఇవి అందరికీ అందుబాటులో లేవు. గూగుల్ ఏఐ సబ్‌స్క్రైబర్లు మాత్రమే వీటిని వినియోగించుకునే అవకాశముంది.
ఇవీ చదవండి..
మెట్రో రైలు విండోకు ఫోన్ కెమెరా.. యువకుడి స్టంట్‌కు లక్షల్లో లైకులు
నాన్నా.. నిన్ను మిస్ అవుతున్నా’.. 14 గంటలు ప్రయాణించిన తండ్రి.!