Share News

మెట్రో రైలు విండోకు ఫోన్ కెమెరా.. యువకుడి స్టంట్‌కు లక్షల్లో లైకులు

ABN , Publish Date - Sep 04 , 2026 | 05:26 PM

వీడియో రికార్డింగ్ కోసం కొందరు అత్యాధునిక పరికరాలు వాడుతుంటారు. వాటితో మోషన్ వీడియోలు తీస్తుంటారు. కానీ ఓ వ్యక్తి మోషన్ వీడియో కోసం ఏకంగా ఢిల్లీ మెట్రో రైలునే ఉపయోగించుకున్నారు. ఎలా అంటారా.?

మెట్రో రైలు విండోకు ఫోన్ కెమెరా.. యువకుడి స్టంట్‌కు లక్షల్లో లైకులు
Man Attaches Phone Camera to Metro

ఇంటర్నెట్ డెస్క్: ఓ వ్యక్తి ఢిల్లీ మెట్రోలో రికార్డ్ చేసిన వీడియో లక్షల వ్యూస్‌తో సోషల్ మీడియోలో తెగ వైరల్ అవుతోంది. అంతలా అది ట్రెండ్ అవడానికి వీడియో తీసిన పద్ధతే కారణం. స్టేషన్‌లో ఆగిన మెట్రో రైలు గ్లాసు విండోకు సదరు వ్యక్తి తన మొబైల్‌ను అతికించారు. అందులో కెమెరా రికార్డిండ్ ఆన్ చేశారు. తరవాత ఓ బాలివుడ్ పాటకు డ్యాన్స్ చేశారు. అయితే మెల్లగా రైలు కదలుతుంటే కిటికీకి ఉన్న ఫోన్ మూవ్ అవుతూ మోషన్ వీడియో రికార్డ్ చేయడం మొదలుపెట్టింది. దాని వెనుకే ఆ వ్యక్తి పరుగులు పెట్టారు. రైలు వేగమందుకోవడంతో ఫోన్ మెట్రో స్టేషన్ మొత్తాన్ని కెమెరాలో బంధించింది. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. సుమారు 135 మిలియన్ల వీక్షణలు వచ్చాయి. ఇలా కొత్తగా వీడియో రికార్డ్ చేయడం చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. లైకుల వర్షాన్ని కురిపిస్తున్నారు.


ఈ వీడియోను మెచ్చుకున్నవారితో పాటు విమర్శిస్తున్నవారూ ఉన్నారు. కొందరు దీన్ని క్షుణ్నంగా పరిశీలించి వీడియోను ఒక్క ఫోన్‌లో రికార్డ్ చేయలేదని విశ్లేషిస్తున్నారు. రైలు కదిలాక మరో వ్యక్తి లోపలి నుంచి వీడియో తీసి ఉంటారని చెబుతున్నారు. రెండు వేరు వేరు షాట్స్‌ను కలిపి ఒకేలా ఎడిట్ చేసి చూసేవాళ్లను మోసం చేస్తున్నారని విమర్శించారు. సెకండాఫ్ వీడియో తీసిన ఫోన్ రైలు లోపలే ఉంది కాబట్టి, మెట్రో విండో గ్లాస్ కూడా కనిపిస్తోందని మరికొందరు ఆధారాలు చూపుతున్నారు. ఆ అద్దంపైన పొగమంచు, లైట్ల ప్రతిబింబాలు గుర్తించవచ్చని అంటున్నారు. ఏది ఏమైనా ఆ వీడియో మాత్రం సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.


ఇవీ చదవండి..

ముగ్గురు పిల్లలతో కలిసి.. లోయలోకి దూకి మహిళా రెజ్లర్ ఆత్మహత్య

ప్రియురాలి ఇంటిపై పెట్రోల్ బాంబ్.. తమిళనాడులో యువకుడి అరెస్ట్

Updated Date - Sep 04 , 2026 | 06:12 PM