Share News

కొండా సురేఖ మాటతీరు మార్చుకోవాలి: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

ABN , Publish Date - Sep 04 , 2026 | 04:39 PM

మంత్రి పదవి నుంచి కొండా సురేఖను తొలగించిన అంశంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్పందించారు. కొండా సురేఖ బర్తరఫ్‌ బాధాకరమన్నారు.

కొండా సురేఖ మాటతీరు మార్చుకోవాలి: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
TPCC Chief Mahesh Goud

హైదరాబాద్, సెప్టెంబర్ 4: మంత్రి పదవి నుంచి కొండా సురేఖను తొలగించిన అంశంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్పందించారు. కొండా సురేఖ బర్తరఫ్‌ బాధాకరమన్నారు. ఈరోజు(శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ.. కుమార్తె సుస్మిత వ్యాఖ్యలను సురేఖ ఖండించాల్సిందని అభిప్రాయపడ్డారు. సుస్మిత వ్యాఖ్యలను సురేఖ ఖండించకపోవడాన్ని ఏఐసీసీ తీవ్రంగా పరిగణించిందని తెలిపారు. కొండా సురేఖ మాటతీరు మార్చుకోవాలని హితవుపలికారు.


క్రమశిక్షణ చర్యల్లో భాగంగానే సురేఖపై చర్యలు తీసుకున్నట్లు మహేశ్ వివరించారు. క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే హైకమాండ్‌ చర్యలు తీసుకుందని వెల్లడించారు. పార్టీ లైన్‌ ఎవరు దాటినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మాట్లాడేందుకు పార్టీలో ఎన్నో వేదికలు ఉన్నాయన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డికి ఎవరినీ బ్లాక్‌మెయిల్‌ చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. భవిష్యత్తులోనూ బీసీలకు పెద్దపీట వేస్తామని మహేశ్ గౌడ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

‘బిగ్ అప్డేట్ కమింగ్ సూన్’.. కొండా సురేఖ పోస్ట్ వైరల్

చెట్ల పొదల్లో మహిళ మృతదేహం.. పోలీసుల దర్యాప్తు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 04 , 2026 | 05:10 PM