గోవా గవర్నర్ స్థల వివాదంపై విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశం
ABN , Publish Date - Sep 04 , 2026 | 04:15 PM
గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు స్థలం వివాదంపై విచారణకు కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
విజయనగరం, సెప్టెంబర్ 4: గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు స్థలం వివాదంపై విచారణకు కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విజయనగరం మున్సిపల్ పరిధిలోని మహారాజుపేట సౌత్ వార్డులో టౌన్ సర్వే నెంబర్ 569 లో 4 ఎకరాల 74 సెంట్లలో.. ఎకరా స్థలంలో వైసీపీ కార్యాలయాన్ని నిర్మించింది. ఈ వ్యవహారాన్ని అశోక్ గజపతిరాజు వెంటనే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తన స్థలంలో అక్రమంగా వైసీపీ కార్యాలయ నిర్మాణం చేపట్టారంటూ గత ఏడాది విజయనగరం కలెక్టర్‌కు ఆధారాలు సమర్పించారు.
సదరు ఆధారాలను పరిశీలించిన కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అప్పటి ఎమ్మార్వో ప్రభాకర్ రావుపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. వారం రోజులలోపు ఆ వివరాలు అన్నీ ఇవ్వాలని జిల్లా ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ఇవి కూడా చదవండి...
దారుణం.. అనుమానంతో భార్యపై విచక్షణారహితంగా..
చంద్రబాబుతోనే సాగునీటి ప్రాజెక్టుల పూర్తి: కాల్వ శ్రీనివాసులు
Read Latest AP News And Telugu News