Share News

చెట్ల పొదల్లో మహిళ మృతదేహం.. పోలీసుల దర్యాప్తు

ABN , Publish Date - Sep 04 , 2026 | 01:57 PM

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పోచారం ఐటీ కారిడార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మహిళ మృతదేహం కలకలం రేపింది. యమ్నంపేటలోని ఓ యూనివర్సిటీ సమీపంలోని చెట్ల పొదల్లో మృతదేహం లభ్యమైంది.

చెట్ల పొదల్లో మహిళ మృతదేహం.. పోలీసుల దర్యాప్తు
Hyderabad News

మేడ్చల్‌-మల్కాజిగిరి, సెప్టెంబర్ 4: జిల్లాలోని పోచారం ఐటీ కారిడార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మహిళ మృతదేహం కలకలం రేపింది. యమ్నంపేటలోని ఓ యూనివర్సిటీ సమీపంలోని చెట్ల పొదల్లో మృతదేహం లభ్యమైంది. యూనివర్సిటీ సిబ్బంది సమాచారంతో పోచారం ఐటీ కారిడార్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. ఘటనా స్థలిలో క్లూస్‌ టీమ్‌తో ఆధారాల సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.


మృతురాలి వయసు దాదాపు 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. దాదాపు వారం రోజుల క్రితమే మృతిచెంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే హత్య జరిగిందా? ఇతర కారణాలతో మృతి చెందిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్‌ నివేదికల అనంతరం మరణానికి అసలు కారణం తేలే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

తెలంగాణలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు.. ఇస్కాన్ ఆలయాల్లో భక్తుల రద్దీ

‘బిగ్ అప్డేట్ కమింగ్ సూన్’.. కొండా సురేఖ పోస్ట్ వైరల్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 04 , 2026 | 02:05 PM