భార్యాభర్తల గొడవ.. మధ్యలో వెళ్లిన కానిస్టేబుల్‌పైనే..
ABN , Publish Date - Sep 04 , 2026 | 12:35 PM
మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూర్‌లో దారుణం జరిగింది. డ్యూటీలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌పై ఓ యువకుడు కత్తితో దాడి చేయడం కలకలం రేపుతోంది. యువకుడి దాడిలో సదరు పోలీస్ తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.
మహబూబాబాద్, సెప్టెంబర్ 4: జిల్లాలోని తొర్రూర్‌లో దారుణం జరిగింది. డ్యూటీలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌పై ఓ యువకుడు కత్తితో దాడి చేయడం కలకలం రేపుతోంది. యువకుడి దాడిలో సదరు పోలీస్ తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. దంపతుల మధ్య గొడవే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. తొర్రూర్ గ్రామానికి చెందిన దంపతులు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో భార్యపై భర్త దాడికి దిగడంతో వెంటనే బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. 112కు కాల్ చేసి భర్త గొడవపడుతున్న విషయాన్ని తెలియజేసింది.
వెంటనే స్పందించిన బ్లూకోర్ట్ కానిస్టేబుల్ వారి ఇంటికి వెళ్లారు. దంపతులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. అయితే కోపంతో ఉన్న యువకుడు ఏకంగా పోలీస్‌పైనే కత్తితో దాడి చేశాడు. దీంతో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని గాయపడిన కానిస్టేబుల్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
తెలంగాణలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు.. ఇస్కాన్ ఆలయాల్లో భక్తుల రద్దీ
‘బిగ్ అప్డేట్ కమింగ్ సూన్’.. కొండా సురేఖ పోస్ట్ వైరల్
Read Latest Telangana News And Telugu News