Share News

ఐపీఎల్ 2027: ఫ్రాంచైజీలు రిలీజ్ చేసిన ప్లేయర్ల పూర్తి లిస్ట్ ఇదే!

ABN , Publish Date - Nov 17 , 2026 | 07:27 PM

ఐపీఎల్ 2027కు సంబంధించి ఫ్రాంచైజీలు రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితా విడుదలైంది. కాగా డిసెంబర్ 16న గోవాలో ఆటగాళ్ల వేలం జరగనుంది.

ఐపీఎల్ 2027: ఫ్రాంచైజీలు రిలీజ్ చేసిన ప్లేయర్ల పూర్తి లిస్ట్ ఇదే!
IPL 2027

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2027కు సంబంధించి ఫ్రాంచైజీలు రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితా విడుదలైంది. కాగా డిసెంబర్ 16న గోవాలో ఆటగాళ్ల వేలం జరగనుంది. కాగా ధోనీ ఐపీఎల్ నుంచి రిటైర్ అవ్వగా.. పలువురు స్టార్ ప్లేయర్లను ఫ్రాంచైజీలు వదులుకున్నాయి. రిటెన్షన్ల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత.. ఏ ఫ్రాంచైజీ దగ్గర ఉంది? జట్లు వదులుకున్న స్టార్ ప్లేయర్లు ఎవరు? దానికి సంబంధించిన పూర్తి లిస్ట్ ఇదే..


ఫ్రాంచైజీలు వదులుకున్న ప్లేయర్లు వీరే..

ముంబై ఇండియన్స్: ట్రెంట్‌ బౌల్ట్, దీపక్‌ చాహర్‌, కేశవ్‌ మహరాజ్‌, ఏఎం ఘజన్‌ఫర్‌, మయాంక్ మార్కండే

ఢిల్లీ: మిచెల్‌ స్టార్క్‌, నితీశ్‌ రాణా, అభిషేక్‌ పొరెల్‌, బెన్‌ డకెట్‌, నిశాంక, కరుణ్‌ నాయర్‌

పంజాబ్‌: లాకీ ఫెర్గూసన్‌, నేహల్‌ వధేరా, ప్రవీణ్‌ దూబె

ఎస్‌ఆర్‌హెచ్‌: ట్రావిస్‌ హెడ్‌, కమిందు మెండిస్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, మదుశంక

సీఎస్‌కే: ఎంఎస్‌ ధోని (రిటైర్డ్‌), మ్యాట్‌ హెన్రీ, కుల్దీప్‌ యాదవ్‌, మాథ్యూ షార్ట్‌

ఆర్సీబీ: జాకబ్‌ బెథెల్‌, రిచర్డ్‌ గ్లీసన్‌, మంగేశ్‌ యాదవ్‌, విహాన్‌ మల్హోత్రా, సాత్విక్‌ దేశ్వాల్‌

ఎల్‌ఎస్‌జీ: అవేశ్‌ ఖాన్‌, నోకియా, వనిందు హసరంగ

గుజరాత్‌ టైటాన్స్: షారుక్‌ ఖాన్‌, ఇశాంత్‌ శర్మ, ల్యూక్‌ వుడ్‌

కేకేఆర్‌: మతీశ పతిరన

ఆర్‌ఆర్‌: హెట్‌మయర్‌, తుషార్‌ దేశ్‌ పాండే


ఏ ఫ్రాంచైజీ దగ్గర ఎంత ఉందంటే..?

ట్రేడింగ్‌లు, రిటైన్‌లు పూర్తయ్యాక ప్రస్తుతం ఫ్రాంచైజీల దగ్గర ఎంత మొత్తం ఉందంటే.. ఎల్‌ఎస్‌జీ- రూ.47.45 కోట్లు, కేకేఆర్‌- రూ.41.65 కోట్లు, ఎస్‌ఆర్‌హెచ్‌- రూ. 40.15 కోట్లు, డీసీ- రూ. 39.5 కోట్లు, ముంబై- రూ. 32.6 కోట్లు, సీఎస్‌కే- రూ. 28.05 కోట్లు, ఆర్‌ఆర్‌- రూ. 27.05 కోట్లు, పంజాబ్‌- రూ.18.6 కోట్లు, ఆర్సీబీ - రూ.14.5 కోట్లు, గుజరాత్‌- రూ. 8.75 కోట్లు.


ఫ్రాంచైజీల వారీగా మిగిలి ఉన్న స్లాట్లు (మొత్తం/ఓవర్సీస్‌):

ఎల్‌ఎస్‌జీ: 7/3; కేకేఆర్‌ 8/3; ఎస్‌ఆర్‌హెచ్‌ 7/3; డీసీ 9/4; ముంబై 9/2; సీఎస్‌కే 6/2; ఆర్‌ఆర్‌ 6/3; పంజాబ్‌ 6/2; ఆర్సీబీ 5/1; గుజరాత్‌ 3/2.


ఇవి కూడా చదవండి:

అరుదైన గౌరవం.. ఐఎస్ఎస్ఎఫ్ అథ్లెట్స్ కమిటీలోకి భారత షూటర్ మను భాకర్

ఐపీఎల్ 2027: ఎల్ఎస్‌జీతో ట్రేడ్ డీల్.. రాజస్థాన్ రాయల్స్‌కు షమీ

Updated Date - Nov 17 , 2026 | 07:42 PM