ఐపీఎల్ 2027: ఎల్ఎస్‌జీతో ట్రేడ్ డీల్.. రాజస్థాన్ రాయల్స్‌కు షమీ
ABN , Publish Date - Nov 17 , 2026 | 04:36 PM
రాజస్థాన్ రాయల్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మల్టీ ప్లేయర్ ట్రేడ్ డీల్ జరిగింది. దీంట్లో భాగంగా సీనియర్ పేసర్ మహ్మద్ షమీని రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఆటగాళ్ల ట్రేడింగ్‌లో కీలక మార్పు చోటు చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మల్టీ ప్లేయర్ ట్రేడ్ డీల్ జరిగింది. దీంట్లో భాగంగా సీనియర్ పేసర్ మహ్మద్ షమీని రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేయగా, రాయల్స్ ఆల్‌రౌండర్ శామ్ కరన్ లఖ్‌నవూలో చేరాడు. షమీతో పాటు మరో స్పిన్నర్ ఎం.సిద్ధార్థ్ కూడా ఆర్ఆర్‌తో చేరాడు.
35 ఏళ్ల షమీని రాజస్థాన్ రాయల్స్ రూ.8 కోట్లకు సొంతం చేసుకుంది. గతంలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ అతడిని రూ.10 కోట్లకు తీసుకోగా.. తాజా ట్రేడింగ్‌లో రూ.2 కోట్లు తగ్గాయి. కొత్త బంతితో వికెట్లు తీయగల సామర్థ్యం, అంతర్జాతీయ క్రికెట్‌లో అపార అనుభవం షమీకి ప్రధాన బలాలు. దీంతో రాజస్థాన్ బౌలింగ్ విభాగం మరింత పటిష్టం కానుంది. షమీ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 132 మ్యాచ్‌లు ఆడి 145 వికెట్లు పడగొట్టాడు. పవర్‌ప్లేలో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బందిపెట్టడంలో అతడికి మంచి రికార్డు ఉంది. రాబోయే సీజన్‌లో రాజస్థాన్ తరఫున షమీ ఎలా రాణిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ ట్రేడింగ్‌లో భాగంగా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ శామ్ కరన్ లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు మారాడు. రాజస్థాన్ నుంచి వచ్చిన కరన్‌ను అతడి ప్రస్తుత ధర రూ.2.4 కోట్లకే లఖ్‌నవూ దక్కించుకుంది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించగల సామర్థ్యం కరన్.. ఇప్పటివరకు ఐపీఎల్‌లో 997 పరుగులు చేయడంతో పాటు 59 వికెట్లు పడగొట్టాడు. ముగ్గురు ఆటగాళ్ల ట్రేడింగ్‌లో భాగంగా స్పిన్నర్ ఎం. సిద్ధార్థ్ కూడా లఖ్‌నవూ నుంచి రాజస్థాన్ రాయల్స్‌కు వెళ్లాడు. అతడి ప్రస్తుత ధర రూ.75 లక్షలుగానే కొనసాగనుంది.
ఇంటర్నెట్ డెస్క్:
ఐపీఎల్‌కు ధోనీ రిటైర్‌మెంట్.. సీఎస్కే మెంటార్‌గా కొత్త బాధ్యతలు
ఐపీఎల్ 2027: గుజరాత్ జట్టులో చేరిన ఎస్ఆర్‌హెచ్ స్టార్ బౌలర్