Share News

పరారీలో ఉన్నానన్న ప్రచారాలు ఆపండి.. భారత్‌ను ఎందుకు వీడానంటే?: లలిత్ మోదీ

ABN , Publish Date - Nov 17 , 2026 | 03:44 PM

ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను భారత దేశాన్ని విడిచిపెట్టడానికి కారణాలు ఏంటో వివరించారు. కేసులు, విచారణల కారణంగా దేశాన్ని విడిచి పారిపోయానని చేస్తోన్న ప్రచారాల్లో వాస్తవం లేదని తెలిపారు.

పరారీలో ఉన్నానన్న ప్రచారాలు ఆపండి.. భారత్‌ను ఎందుకు వీడానంటే?: లలిత్ మోదీ
Lalit Modi

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను భారత దేశాన్ని విడిచిపెట్టడానికి కారణాలు ఏంటో వివరించారు. కేసులు, విచారణల కారణంగా దేశాన్ని విడిచి పారిపోయానని చేస్తోన్న ప్రచారాల్లో వాస్తవం లేదని తెలిపారు. 2010లో అండర్ వరల్డ్ నుంచి బెదిరింపుల్ రావడంతోనే దేశం విడిచి వెళ్లినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేశారు.


‘2010లో అండర్ వరల్డ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. అప్పటి వరకు ఉన్న సాయుధ పోలీసు భద్రతను కూడా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఉపసంహరించుకున్నారు. ప్రాణహానితో భారత్‌ను విడిచిపెట్టా. ఆ సమయానికి నాపై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలుదు. కేంద్ర నిఘా సంస్థల నుంచి అందిన సమాచారంతోనే నాకు భద్రత కల్పించినట్లు ముంబై పోలీసుల అదనపు కమిషనర్ ఈడీకి రాసిన లేఖలో ధ్రువీకరించారు. నా భారత పాస్‌పోర్టును ఈడీ అభ్యర్థన మేరకు రద్దు చేసినప్పటికీ, 2014లో ఢిల్లీ హైకోర్టు ఆ నిర్ణయాన్ని పరిశీలించి పాస్‌పోర్టు రద్దు కేసును కొట్టేసింది.


నేను భారత్ నుంచి పారిపోయినట్లు, కేసులను ఎదుర్కొనేందుకు భయపడి విదేశాలకు వెళ్లినట్లు కొన్ని మీడియా సంస్థలు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నాయి. ఇలాంటి అసత్య ప్రచారాలు చేయండి ఇకనైనా ఆపండి. వీటిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటా. గత 16 ఏళ్లకు పైగా నాపై భారతదేశంలోని ఏ కోర్టులోనూ ఛార్జిషీట్ దాఖలు కాలేదు. అయితే 2010 అక్టోబర్‌లో బీసీసీఐ అప్పటి కార్యదర్శి ఎన్. శ్రీనివాసన్ ఫిర్యాదు మేరకు చెన్నైలో ఎఫ్‌ఐఆర్ మాత్రం నమోదైంది. అది వ్యక్తిగత కక్షతో చేశారు. ఐపీఎల్‌లో శ్రీనివాసన్‌కు ఉన్న ప్రయోజనాల గురించి నేను ప్రశ్నించినందుకే నన్ను ఐపీఎల్ నుంచి తప్పించాలనే ఉద్దేశంతో ఈ ఫిర్యాదు చేశారు. బీసీసీఐ పదవితో పాటు ఐపీఎల్ పాలక మండలిలో సభ్యుడిగా, చెన్నై సూపర్ కింగ్స్ యజమానిగా ఒకేసారి కొనసాగడం ప్రయోజనాల సంఘర్షణకు దారితీసింది’ అని లలిత్ మోదీ వివరించారు.


ఇంటర్నెట్ డెస్క్:

ఐపీఎల్‌కు ధోనీ రిటైర్‌మెంట్.. సీఎస్కే మెంటార్‌గా కొత్త బాధ్యతలు

ఐపీఎల్ 2027: గుజరాత్ జట్టులో చేరిన ఎస్ఆర్‌హెచ్ స్టార్ బౌలర్

Updated Date - Nov 17 , 2026 | 03:47 PM