న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్.. పంత్‌పై గిల్ కీలక ప్రకటన!
ABN , Publish Date - Nov 17 , 2026 | 12:10 PM
రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నవంబర్ 19 నుంచి వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించి టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక విషయాలను వెల్లడించారు.
స్పోర్ట్స్ డెస్క్: రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం నుంచి న్యూజిలాండ్, భారత్ మధ్య తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి టెస్టులో నలుగురు పేసర్లతో బరిలోకి దిగుతామని టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. తుది జట్టును ఇంకా ఖరారు చేయలేదని, రిషభ్ పంత్ మాత్రం పక్కా ఆడుతాడని స్పష్టం చేశాడు. ఈ సిరీస్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీమిండియా.. ప్రత్యేక ప్రాక్టీస్ శిబిరంలో ముమ్మర సాధన చేసింది.
తొలి టెస్ట్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన శుభ్‌మన్ గిల్.. టీమిండియా కాంబినేషన్‌కు సంబంధించి కీలక విషయాలను వెల్లడించాడు. 'ఈ పర్యటనలో మా పేసర్లందరూ బాగా రాణించారు. దీంతో టెస్ట్ సిరీస్ కోసం తుది జట్టు ఎంపిక మాకు కొంచెం క్లిష్టంగా మారింది. వన్డే సిరీస్‌లో కూడా పేసర్లు సత్తా చాటారు. జట్టు కాంబినేషన్‌పై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి మేము నలుగురు పేసర్లు, ఏడుగురి బ్యాటర్లతో బరిలోకి దిగాలనుకుంటున్నాం. ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో అన్షుల్ కాంబోజ్, ఆకాశ్ దీప్ ఆడుతారు. అయితే తుది జట్టు ఎంపికపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు' అని గిల్ పేర్కొన్నాడు.
'వన్డేల కంటే టెస్ట్ సిరీస్ పెద్ద సవాల్. ఈ ఫార్మట్‌లో, అలానే వారి సొంతగడ్డపై న్యూజిలాండ్‌కు మంచి రికార్డ్ ఉంది. దీంతో తొలి టెస్ట్ ఎంతో ఉత్కంఠభరితంగా ఉండబోతుంది. రిషభ్ పంత్ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అతను తుది జట్టులో ఆడుతాడు. అతనికి 50 టెస్ట్‌లు ఆడిన అనుభవంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల పిచ్‌లపై పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ చేసిన వికెట్ కీపర్ అతను' అని ఈ సందర్భంగా శుభ్‌మన్ గిల్ గుర్తు చేశాడు.
ఇవి కూడా చదవండి:
జయదేవ్ ఉనాద్కత్‌పై శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు..
సౌతాఫ్రికా గడ్డపై బంగ్లాదేశ్ అరుదైన ఘనత.. తొలిసారి 400 మార్క్..