జయదేవ్ ఉనాద్కత్‌పై శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు..
ABN , Publish Date - Nov 17 , 2026 | 10:21 AM
ఐపీఎల్ 2027 రిటెన్షన్ గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ప్రణాళికలు, ఆటగాళ్ల రిటెన్షన్‌పై భారత మాజీ క్రికెటర్, మాజీ సెలక్టర్ క్రిస్ శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
స్పోర్ట్స్ డెస్క్ : ఐపీఎల్ 2027 రిటెన్షన్ గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ప్రణాళికలు, ఆటగాళ్ల రిటెన్షన్‌పై భారత మాజీ క్రికెటర్, మాజీ సెలక్టర్ క్రిస్ శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పేసర్ హర్షల్ పటేల్ గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుకు ట్రేడ్ కానున్నాడనే వార్తల నేపథ్యంలో.. ఎస్ఆర్‌హెచ్ జట్టు కూర్పుపై శ్రీకాంత్ స్పందించారు. గత ఐపీఎల్‌లో తుది జట్టులో పెద్దగా అవకాశాలు దక్కని సీనియర్ పేసర్ జయదేవ్ ఉనాద్కత్‌ను ఎస్ఆర్‌హెచ్ ఎందుకు వదులుకోవడం లేదంటూ ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. ‘ఉనాద్కత్‌ను ఎస్ఆర్‌హెచ్ ఇంకా ఎందుకు వదులుకోలేదో నాకు అర్థం కావడం లేదు. అతడిని తుది జట్టులోకి తీసుకునే విషయాన్ని ఎలా పరిశీలిస్తారో తెలియదు. కేవలం ‘ఓల్డ్ వర్క్‌హార్స్’ (అనుభవజ్ఞుడు) అనే ముద్రతో ఫ్రాంచైజీ అతడిని ఇంకా అట్టిపెట్టుకుంది. అతడు ఇంతకాలం ఫేక్ బౌలింగ్‌తో చాలా కాలం ఆడుతున్నాడు. అతడు తుది జట్టులో ఎలా చోటు సంపాదిస్తాడో నాకు తెలియదు. కానీ వారు(ఎస్ఆర్‌హెచ్) ఉనాద్కత్‌ను ఒక పాత పనివాడని పిలిచి ఉంచుకుంటారు’ అని ఘాటుగా స్పందించారు. ఇక హర్షల్ పటేల్ గుజరాత్ జట్టు తుదిలోకి వస్తాడా లేదా అన్నది సందేహమేనని, ఎవరైనా గాయపడితే బ్యాకప్‌గా ఉంచుకునేందుకే గుజరాత్ అతడిని తీసుకోవాలని చూస్తోందని శ్రీకాంత్ విశ్లేషించారు.
గత ఐపీఎల్ మెగా వేలంలో రూ. 8 కోట్లకు అమ్ముడైన హర్షల్ పటేల్.. 2025 సీజన్‌లో 13 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీసినప్పటికీ, 2026 సీజన్‌లో కేవలం 5 మ్యాచ్‌లే ఆడి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. ఈ తరుణంలో రూ. 4 కోట్ల ధరకు అతడిని జీటీకి ట్రేడ్ చేయనున్నట్లు సమాచారం. మరోవైపు 2026 సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్ తరఫున ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ రూపంలో కొత్త యువ సంచలనాలు వెలుగులోకి రాగా, ఉనాద్కత్‌కు మాత్రం తుది జట్టులో పెద్దగా అవకాశాలు దక్కలేదు.
ఇవి కూడా చదవండి:
ముద్దంటూ విదేశీయురాలిని వేధించిన వ్యక్తి.. కట్ చేస్తే జైల్లో..
అమితాబ్, అభిషేక్ బచ్చన్‌ల హత్యకు 200 మంది సిద్ధం.. గోల్డీ ధిల్లాన్ మరోసారి బెదిరింపులు..