Share News

సౌతాఫ్రికా గ‌డ్డ‌పై బంగ్లాదేశ్‌ అరుదైన ఘనత.. తొలిసారి 400 మార్క్..

ABN , Publish Date - Nov 17 , 2026 | 07:04 AM

సౌతాఫ్రికాతో జ‌రుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ అరుదైన ఘనత సాధించింది. స‌ఫారీ గ‌డ్డ‌పై టెస్టుల్లో తొలిసారి 400 ప‌రుగుల మార్క్‌‌ను టచ్ చేసి.. రికార్డుల‌కెక్కింది. ఇప్ప‌టివ‌ర‌కు టెస్టుల్లో బంగ్లా జ‌ట్టుకు సౌతాఫ్రికాపై 326 పరుగులే అత్య‌ధికం.

 సౌతాఫ్రికా గ‌డ్డ‌పై బంగ్లాదేశ్‌ అరుదైన ఘనత.. తొలిసారి 400 మార్క్..
South Africa vs Bangladesh

స్పోర్ట్స్ డెస్క్: క్రికెట్‌లో అనిశ్చితికి మారుపేరు పాకిస్థాన్. ఎప్పుడు ఏ విధంగా ఆడుతుందో ఎవ్వరూ ఊహించలేరు. దాదాపు అదే కోవాలో బంగ్లాదేశ్ ప్రదర్శన ఉంటుంది. తాజాగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో 120కే సగం వికెట్లు కోల్పోయిన బంగ్లా జట్టు.. ఆ తర్వాత ఊహించని విధంగా పుంజుకుని చరిత్ర సృష్టించింది. స‌ఫారీ గ‌డ్డ‌పై టెస్టుల్లో తొలిసారి 400 ప‌రుగుల మార్క్ దాటి రికార్డుల‌కెక్కింది. ఇప్ప‌టివ‌ర‌కు టెస్టుల్లో బంగ్లా జ‌ట్టుకు ప్రొటీస్ జట్టుపై 326 పరుగులే అత్య‌ధిక స్కోరుగా ఉండేది. తాజాగా జోహ‌న్నెస్‌బ‌ర్గ్ వేదిక‌గా జ‌రుగుతున్న టెస్టులో బంగ్లాదేశ్ 400 ప‌రుగుల‌కు ఆలౌటైంది.


టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. బంగ్లా బ్యాటర్లు తౌహిద్ హృదోయ్ (137), లిట‌న్ దాన్ (120) అద్భుత సెంచరీలతో ఆకట్టుకున్నారు. తమీమ్(67) అర్ధసెంచరీతో రాణించాడు. బంగ్లా 400 పరుగుల మార్క్‌ను అందుకోవడంలో ఈ ముగ్గురు బ్యాటర్లు కీలక పాత్ర పోషించారు. అనంత‌రం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన సౌతాఫ్రికా రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 62 ఓవర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 287 ప‌రుగులు చేసింది. మార్క్యూస్ అకెర్‌మ‌న్ (157) సెంచ‌రీతో చెల‌రేగ‌గా, జుబైర్ హంజా (83) అర్థ‌సెంచ‌రీ సాధించాడు. ప్ర‌స్తుతం ప్రొటీస్ మ‌రో 113 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది.


టెస్టుల్లో సౌతాఫ్రికాపై బంగ్లాదేశ్ న‌మోదు చేసిన టాప్‌-5 అత్య‌ధిక స్కోర్లు

  • 2026- జోహ‌న్నెస్‌బ‌ర్గ్ టెస్టులో 400 పరుగులు

  • 2015- చట్టోగ్రామ్ టెస్టులో 326 ప‌రుగులు

  • 2017- పోట్చెస్ట్రూమ్ టెస్టులో 320 ప‌రుగులు

  • 2024- మీర్పూర్ మ్యాచ్‌లో307 ప‌రుగులు

  • 2022- డ‌ర్బ‌న్ మ్యాచ్‌లో 298 ప‌రుగులు


ఇవి కూడా చదవండి:

ధోనీని గుర్తు చేశాడు.. మోహిత్ ఉల్వాపై సునీల్ గావస్కర్ ప్రశంసల వర్షం

సీపీఎస్‌ రద్దు చేసి..ఓపీఎస్‌ పునరుద్ధరించండి

Updated Date - Nov 17 , 2026 | 07:04 AM