Share News

రోహిత్‌ భవితవ్యం.. ఓజాకు పరీక్ష!

ABN , Publish Date - Nov 17 , 2026 | 04:14 AM

న్యూజిలాండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో సీనియర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ప్రదర్శనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి...

రోహిత్‌ భవితవ్యం.. ఓజాకు పరీక్ష!

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో సీనియర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ప్రదర్శనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రోహిత్‌ ఆడిన నాలుగు మ్యాచుల్లో కలిపి మొత్తం 30 పరుగులే చేశాడు. అందునా బౌన్స్‌, పేస్‌ ఉన్న వికెట్‌పై హిట్‌మ్యాన్‌ వైఫల్యం జట్టును మరింత ఆందోళనకు గురి చేస్తోంది. వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్‌ జరిగే దక్షిణాఫ్రికాలో కూడా పరిస్థితులు ఇంచుమించు ఇలాగే ఉండే నేపథ్యంలో.. రోహిత్‌ భవితవ్యంపై నిర్ణయం తీసుకోవాల్సి రావడం చీఫ్‌ సెలెక్టర్‌ ప్రజ్ఞాన్‌ ఓజాకు ఇప్పుడు అగ్నిపరీక్షగా మారిందని తెలుస్తోంది. అయితే, విశ్వక్‌పను ముద్దాడాలనే కోరిక రోహిత్‌లో బలంగా ఉంది. మరోవైపు జూనియర్‌ స్థాయి నుంచి రోహిత్‌తో ఓజాకు మంచి స్నేహం ఉంది. ఈ చొరవతోనే ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రోహిత్‌ మనోగతాన్ని తెలుసుకోవాలని అప్పటి చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ సూచన మేరకు ఓజా.. రోహిత్‌ను కలిశాడు. కానీ, ఫామ్‌లో ఉన్న రోహిత్‌ వీడ్కోలు పలికేందుకు నిరాకరించాడు. అయితే, కివీస్‌ టూర్‌లో వైఫల్యం రోహిత్‌ సామర్థ్యంపై మరోసారి అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కివీస్‌తో వన్డే సిరీస్‌లో టాపార్డర్‌ తడబాటు ఆందోళన చెందాల్సిన విషయమేనని చీఫ్‌ కోచ్‌ గంభీర్‌ కూడా ఇటీవల అంగీకరించాడు. వరల్డ్‌క్‌పనకు మరో 11 నెలల సమయం ఉంది. ఈ మధ్యలో శ్రీలంక, జింబాబ్వేతో స్వదేశంలో భారత్‌ ఆరు వన్డేలు ఆడనుంది. ఒకవేళ రోహిత్‌ పరుగుల వరద పారించినా.. బౌన్స్‌, పేస్‌ను ఎదుర్కొనే విషయంలో బలహీనత అతడిని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో హిట్‌మ్యాన్‌ విషయంలో ఓజా ఎలాంటి నిర్ణయం తీసుకొంటాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి:

ఐసీసీ ఛైర్మన్‌గా జై షా పునర్నియామకం

ధోనీని గుర్తు చేశాడు.. మోహిత్ ఉల్వాపై సునీల్ గావస్కర్ ప్రశంసల వర్షం

Updated Date - Nov 17 , 2026 | 04:14 AM