Share News

ధోనీని గుర్తు చేశాడు.. మోహిత్ ఉల్వాపై సునీల్ గావస్కర్ ప్రశంసల వర్షం

ABN , Publish Date - Nov 16 , 2026 | 10:41 AM

అండర్ 19 ఆసియా కప్ హీరో మోహిత్ ఉల్వాను భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ప్రశంసించాడు. అతడు కొట్టిన బౌండరీని చూస్తే 2011 వన్డే ప్రపంచ కప్‌లో ఎంఎస్ ధోని విన్నింగ్ షాట్ గుర్తొచ్చిందని వెల్లడించాడు.

ధోనీని గుర్తు చేశాడు.. మోహిత్ ఉల్వాపై సునీల్ గావస్కర్ ప్రశంసల వర్షం
Sunil Gavaskar

ఇంటర్నెట్ డెస్క్: అండర్ 19 ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై అద్భుత ప్రదర్శన చేసిన భారత యువ ఆటగాడు మోహిత్ ఉల్వాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మోహిత్.. అజేయంగా 49 పరుగులు చేసి ఆఖరి బంతికి బౌండరీ బాది జట్టుకు విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. తాజాగా భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్.. మోహిత్ ఉల్వాను ప్రశంసించాడు. అతడు కొట్టిన బౌండరీని చూస్తే 2011 వన్డే ప్రపంచ కప్‌లో ఎంఎస్ ధోని విన్నింగ్ షాట్ గుర్తొచ్చిందని వెల్లడించాడు.


‘కీలక సమయంలో మోహిత్ ఉల్వా అద్భుతంగా రాణించాడు. ఒత్తిడిలోనూ కూల్‌గా పరుగులు సాధించి జట్టును విజయాన్ని అందించాడు. ఈ విషయంలో మోహిత్‌ను చూస్తే ఎంఎస్ ధోని గుర్తుకు వచ్చాడు. మ్యాచ్‌ను గెలిపించిన తర్వాత ఉల్వా హెల్మెట్ తీసి పక్కన పెట్టి, చేతులు పైకెత్తి విజయాన్ని ఆస్వాదించిన తీరు అద్భుతంగా ఉంది. ధోనీ కూడా ఇలాగే చేసేవాడు. మోహిత్ ఉల్వా బౌండరీ బాదిన తీరును చూస్తే 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో ధోని కొట్టిన విన్నింగ్ సిక్సర్ గుర్తొచ్చింది. ఆ రోజు ధోని కూడా మ్యాచ్ గెలిపించిన తర్వాత బ్యా్ట్ పైకెత్తి గెలుపును ఆస్వాదించాడు. అండర్ 19 ఆసియా కప్ ఫైనల్‌లో పాక్‌పై విజయానంతరం ఉల్వా చూపించిన స్పందన కూడా అంతే గుర్తుండిపోతుంది’ అని గావస్కర్ వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

భారత యువ జట్టు అద్భుతంగానే ఆడింది.. కానీ: షోయబ్ అక్తర్

భారత బ్యాటర్లు ఆటతీరును మెరుగుపరుచుకోవాలి: రవి శాస్త్రి

Updated Date - Nov 16 , 2026 | 10:42 AM