ఒకటిరెండు మ్యాచ్‌లు రోహిత్-కోహ్లీ కెరీర్‌ను డిసైడ్ చేయలేవు: అజయ్ జడేజా
ABN , Publish Date - Nov 16 , 2026 | 09:42 AM
భారత సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్‌పై చర్చ కొనసాగుతోంది. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో రో-కో విఫలమైన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్‌పై చర్చ కొనసాగుతోంది. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో రో-కో విఫలమైన సంగతి తెలిసిందే. నాలుగో వన్డేలో డకౌట్ అయిన కోహ్లీ.. చివరి మ్యాచ్‌లో ఐదు పరుగులకే పెవిలియన్ చేరాడు. మరోవైపు రోహిత్ శర్మ కూడా నాలుగో వన్డేలో గోల్డెన్ డకౌట్ కాగా.. ఐదో వన్డేలో ఏడు పరుగులకే ఔటయ్యాడు. దీంతో 2027 వన్డే ప్రపంచ కప్ సన్నాహకంగా భావించిన ఈ సిరీస్‌లో వీరిద్దరూ పరుగులు సాధించలేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా స్పందించాడు. ఒకటిరెండు మ్యాచ్‌ల్లో విఫలమైనంత మాత్రానా రోహిత్, కోహ్లీ కెరీర్‌ను తక్కువగా అంచనా వేయలేమని స్పష్టం చేశాడు.
‘14 ఏళ్లుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భారత జట్టుకు ఎన్నో సేవలు అందించారు. ఇప్పుడు ఒక్క మ్యాచ్, ఒక్క సిరీస్ ఆధారంగా వీరిపై విమర్శలు చేయడం సరికాదు. ఈ న్యూజిలాండ్ పర్యటనలో కోహ్లీ, రోహిత్‌లు స్వేచ్ఛగా ఆడారు. వారి కెరీర్ ఇప్పుడు ఆఖరి దశకు చేరుకుందని నా అభిప్రాయం. ఇప్పుడు అభిమానులను అలరించేందుకే రో-కో క్రికెట్ ఆడుతున్నారు. ఒక మ్యాచ్‌లో పరుగులు చేయకపోవడం సహజం. త్వరగా ఔటవడం క్రికెట్‌లో భాగమే. పర్యటనను విజయంతో ముగించాలని ప్రతి ఆటగాడూ కోరుకుంటాడు. కానీ న్యూజిలాండ్‌తో చివరి మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన వారి స్థాయి తగ్గదు. ఒకటిరెండు మ్యాచ్‌లు రో-కో కెరీర్‌ను డిసైడ్ చేయలేవు. ఇన్నేళ్లుగా వారు సాధించిన విజయాలే వారి గొప్పతనానికి నిదర్శనం’ అని అజయ్ జడేజా ప్రశంసించాడు.
అదే విరాట్ కోహ్లీ అసలైన లక్షణం!
‘కోహ్లీని చూడటానికే అభిమానులు మైదానానికి వస్తారు. అతడు త్వరగా ఔటై మైదానంలో నిశ్శబ్దంగా ఉండి ఉంటే అభిమానులు నిరాశ చెందేవారు. కానీ అభిమానులు చూడాలనుకున్న విరాట్ ఇప్పుడు మైదానంలో కనిపిస్తున్నాడు. రోజంతా ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపుతూ, ప్రతి సందర్భంలోనూ దూకుడుగా స్పందించే కోహ్లీనే అభిమానులు చూస్తున్నారు. కివీస్‌పై ఓ మ్యాచ్‌లో క్యాచ్ జారవిడిచిన సందర్భంలో కోహ్లీ తనదైన శైలిలో ఆవేశం, కోపం ప్రదర్శించాడు. అదే అసలైన విరాట్ కోహ్లీ’ అంటూ అజయ్ జడేజా వ్యాఖ్యానించాడు.
ఇవి కూడా చదవండి:
భారత యువ జట్టు అద్భుతంగానే ఆడింది.. కానీ: షోయబ్ అక్తర్
భారత బ్యాటర్లు ఆటతీరును మెరుగుపరుచుకోవాలి: రవి శాస్త్రి