భారత యువ జట్టు అద్భుతంగానే ఆడింది.. కానీ: షోయబ్ అక్తర్
ABN , Publish Date - Nov 16 , 2026 | 08:02 AM
అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ అద్భుత విజయం సాధించడంపై పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. ఉత్కంఠపోరులో పాక్‌పై గెలిచిన తర్వాత.. భారత ప్లేయర్లు చేసుకున్న సంబరాలపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ అద్భుత విజయం సాధించడంపై పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. ఉత్కంఠపోరులో పాక్‌పై గెలిచిన తర్వాత.. భారత ప్లేయర్లు చేసుకున్న సంబరాలపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయంపై షోయబ్ అక్తర్ మాట్లాడాడు. భారత యువ ఆటగాళ్ల దూకుడును ప్రశంసిస్తూనే.. మైదానంలో ప్రత్యర్థులకు ఇచ్చిన ఫైరీ సెండ్‌ఆఫ్‌పై తన అభిప్రాయాలను వెల్లడించాడు. ఆటతో పాటు క్రీడాస్ఫూర్తి, విలువలను కూడా గౌరవించాలని సూచించాడు.
‘భారత ప్లేయర్లు అద్భుతంగా రాణించారు. అయితే మైదానంలో ఎంత దూకుడుగా ఆడినా క్రీడాస్ఫూర్తిని మర్చిపోకూడదు. సచిన్ టెండూల్కర్ ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్ అని నేను భావిస్తాను. వీరేంద్ర సెహ్వాగ్, సౌరభ్ గంగూలీతో నాకు మంచి స్నేహం ఉంది. గతంలో మేమెప్పుడూ ఒకరిపై ఒకరం ఈ విధంగా ప్రవర్తించుకోలేదు. ప్రత్యర్థులుగా క్రీడాస్ఫూర్తిని మర్చిపోలేదు. భారత యువ ప్లేయర్లు ఇలా ప్రవర్తించడం సరైంది కాదు.
అయితే ఈ టోర్నీలో పాకిస్థాన్ జట్టే అత్యుత్తమ ప్రదర్శన చేసింది. అయితే కీలకమైన ఫైనల్ పోరులో ఒత్తిడిని తట్టుకోలేక ఓటమిపాలైంది. పాక్ జట్టు భారత్ కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. కానీ ఒత్తిడిని అధిగమించడంలో టీమిండియా మరోసారి తన సత్తా చాటింది. భారత ప్లేయర్లు అద్భుతంగా రాణించారు. మ్యాచ్‌ను ముగించగల సత్తా, నమ్మకం, ప్రతిభ ఉన్న ఆటగాళ్లు జట్టులో ఉన్నారు’ అని షోయబ్ అక్తర్ వివరించాడు.
ఇవి కూడా చదవండి:
బౌలర్లు పరిస్థితులకు తగ్గట్లు పోరాడి జట్టును గెలిపించారు: శ్రేయస్ అయ్యర్
డబ్ల్యూపీఎల్ 2027: ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే.. వేదిక మార్చిన బీసీసీఐ