బౌలర్లు భళా!
ABN , Publish Date - Nov 16 , 2026 | 03:16 AM
బ్యాటర్లు విఫలమైనా.. పేసర్లు అర్ష్‌దీప్ (3/30), సిరాజ్ (2/50) చెలరేగడంతో.. 210 పరుగుల లక్ష్యాన్ని భారత్ కాపాడుకోగలిగింది. ఆదివారం జరిగిన ఆఖరిదైన ఐదో వన్డేలో...
విజృంభించిన అర్ష్‌దీప్, సిరాజ్
ఐదో వన్డేలో కివీస్ ఘోర ఓటమి
3-1తో సిరీస్ భారత్ వశం
మౌంట్ మాంగనుయ్: బ్యాటర్లు విఫలమైనా.. పేసర్లు అర్ష్‌దీప్ (3/30), సిరాజ్ (2/50) చెలరేగడంతో.. 210 పరుగుల లక్ష్యాన్ని భారత్ కాపాడుకోగలిగింది. ఆదివారం జరిగిన ఆఖరిదైన ఐదో వన్డేలో భారత్ 22 పరుగులతో న్యూజిలాండ్‌ను ఓడించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1తో దక్కించుకొంది. తొలుత భారత్ 42.1 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. అక్షర పటేల్ (46), ఇషాన్ కిషన్ (46) రాణించారు. డఫీ, శాంట్నర్ చెరో 3, ఫిషర్ 2 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో కివీస్ 48.1 ఓవర్లలో 187 పరుగులకే కుప్పకూలింది. ఫాక్స్‌క్రాఫ్ట్ (31) టాప్ స్కోరర్. అక్షర్ 2 వికెట్లు కూల్చాడు. ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన యశ్ ఠాకూర్ ఓ వికెట్ తీశాడు. అర్ష్‌దీప్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా, గుర్నూర్ బ్రార్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచారు.
చెలరేగిన పేసర్లు: స్వల్ప లక్ష్య ఛేదనలో కివీస్ ఓపెనర్లు యంగ్ (22), సైఫర్ట్ (14)ను అర్ష్‌దీప్, సిరాజ్ కచ్చితమైన బంతులతో కట్టడి చేశారు. దీంతో అసహనానికి గురైన సైఫర్ట్.. సిరాజ్ బౌలింగ్‌లో భారీషాట్ ఆడే క్రమంలో అవుటయ్యాడు. అయితే, యంగ్, నిక్ కెల్లీ (24) రెండో వికెట్‌కు 38 రన్స్‌తో ఆదుకొనే ప్రయత్నం చేశారు. కానీ, అర్ష్‌దీప్ బౌలింగ్‌లో రుతు రాజ్ అద్భుత క్యాచ్‌తో యంగ్ వెనుదిరిగాడు. కెల్లీని అర్ష్‌దీప్, అలెన్ (1)ను సిరాజ్ బౌల్డ్ చేయడంతో 83/4తో కివీస్ కష్టాల్లో పడింది. బ్రేస్‌వెల్ (19)ను నబీ.. ఫాక్స్‌క్రాఫ్ట్‌ను యశ్ వెనక్కి పంపారు. అయితే, కెప్టెన్ శాంట్నర్ (24), క్రిస్టియన్ క్లార్క్ (16) ఏడో వికెట్‌కు 39 రన్స్ జోడించి ఆశలు రేపారు. కానీ, శాంట్నర్‌ను నమన్.. క్లార్క్‌ను అర్ష్‌దీప్ పెవిలియన్ చేర్చడంతో కివీస్ పనైపోయింది. ఆఖర్లో డఫీ (9), టిక్నర్ (14)ను అక్షర్ వెనక్కిపంపాడు.
టాప్ విఫలం: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఘోరంగా తడబడింది. ఓపెనర్లు రోహిత్ (7), రుతురాజ్ (18)తోపాటు విరాట్ కోహ్లీ (5) మరోసారి విఫలమవడంతో..పవర్‌ప్లేలో భారత్ 34/3తో కష్టాల్లో పడింది. అయితే, మిడిలార్డర్‌లో కెప్టెన్ శ్రేయాస్ (22), అక్షర్, ఇషాన్, నమన్ (22) స్వల్ప భాగస్వామ్యాలతో ఆదుకొనే ప్రయత్నం చేశారు. కానీ, స్కోరుబోర్డు జోరందుకొంటున్న దశలో టీమిండియా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో.. 183/9తో నిలిచింది. ఈ తరుణంలో సిరాజ్ (14 నాటౌట్), అర్ష్‌దీప్ (14) పదో వికెట్‌కు 26 రన్స్ జోడించడంతో.. సిరీ్‌సలో తొలిసారి భారత్ స్కోరు 200 మార్క్ దాటింది.
స్కోరుబోర్డు
భారత్: రోహిత్ (సి) ఫాక్స్‌క్రాఫ్ట్ (బి) ఫిషర్ 7, రుతురాజ్ (సి) సైఫర్ట్ (బి) డఫీ 18, కోహ్లీ (సి) సైఫర్ట్ (బి) ఫిషర్ 5, శ్రేయాస్ (సి) ఫిషర్ (బి) టిక్నర్ 22, అక్షర్ (సి) యంగ్ (బి) బ్రేస్‌వెల్ 46, ఇషాన్ (సి) ఫిషర్ (బి) డఫీ 46, నమన్ (సి) కెల్లీ (బి) శాంట్నర్ 22, నబీ (సి) అలెన్ (బి) శాంట్నర్ 5, యశ్ (సి) సైఫర్ట్ (బి) శాంట్నర్ 0, సిరాజ్ (నాటౌట్) 14, అర్ష్‌దీప్ (బి) డఫీ 14; ఎక్‌ట్రాలు: 10; మొత్తం: 42.1 ఓవర్లలో 209 ఆలౌట్; వికెట్ల పతనం: 1-23, 2-33, 3-34, 4-86, 5-121, 6-160, 7-166, 8-166, 9-183, 10-209; బౌలింగ్: డఫీ 8.1-1-60-3, ఫిషర్ 7-1-28-2, క్లార్క్ 2-0-13-0, టిక్నర్ 5-1-24-1, శాంట్నర్ 10-1-47-3, బ్రేస్‌వెల్ 10-0-35-1.

న్యూజిలాండ్: యంగ్ (సి) రుతురాజ్ (బి) అర్ష్‌దీప్ 22, సైఫర్ట్ (సి) యశ్ (బి) సిరాజ్ 14, కెల్లీ (బి) అర్ష్‌దీప్ 24, ఫాక్స్‌క్రాఫ్ట్ (బి) యశ్ 31, అలెన్ (బి) సిరాజ్ 1, బ్రేస్‌వెల్ (సి) నమన్ (బి) నబీ 19, శాంట్నర్ (సి) అర్ష్‌దీప్ (బి) నమన్ 24, క్లార్క్ (సి) ఇషాన్ (బి) అర్ష్‌దీప్ 16, టిక్నర్ (స్టంప్) ఇషాన్ (బి) అక్షర్ 14, డఫీ (సి) కోహ్లీ (బి) అక్షర్ 9, ఫిషర్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 48.1 ఓవర్లలో 187 ఆలౌట్; వికెట్ల పతనం: 1-26, 2-64, 3-82, 4-83, 5-119, 6-119, 7-158, 8-161, 9-181, 10-187; బౌలింగ్: అర్ష్‌దీప్ 10-2-30-3, సిరాజ్ 10-1-50-2, నబీ 10-1-37-1, యశ్ ఠాకూర్ 10-0-38-1, అక్షర్ 6.1-0-28-2, నమన్ ధిర్ 2-0-4-1.
స్వదేశంలో 11 వరుస సిరీస్ విజయాల తర్వాత న్యూజిలాండ్‌కు ఇదే తొలి ఓటమి.
1
గంభీర్ హయాంలో విదేశాల్లో భారత్‌కు తొలి వన్డే సిరీస్ విజయం.
ఇవి కూడా చదవండి:
బౌలర్లు పరిస్థితులకు తగ్గట్లు పోరాడి జట్టును గెలిపించారు: శ్రేయస్ అయ్యర్
డబ్ల్యూపీఎల్ 2027: ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే.. వేదిక మార్చిన బీసీసీఐ