Share News

‘లక్ష్యం నెరవేరింది

ABN , Publish Date - Nov 16 , 2026 | 03:10 AM

భారత యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ అదిరే ప్రదర్శన చేశాడు..కుమమొటో జపాన్‌ మాస్టర్స్‌ సూపర్‌ 500 టోర్నీ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ దక్కించుకున్నాడు...

‘లక్ష్యం నెరవేరింది

సేన్‌కు జపాన్‌ టైటిల్‌

కుమమొటో (జపాన్‌): భారత యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ అదిరే ప్రదర్శన చేశాడు..కుమమొటో జపాన్‌ మాస్టర్స్‌ సూపర్‌ 500 టోర్నీ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ దక్కించుకున్నాడు..తద్వారా ఈ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన తొలి భారత షట్లర్‌గా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు, ప్రతిష్ఠాత్మక వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌కు క్వాలిఫై అయ్యే దిశగా అతడు బలమైన అడుగు వేశాడు.. ఆదివారం ఉత్కంఠ భరితంగా జరిగిన జపాన్‌ ఓపెన్‌ ఫైనల్లో సేన్‌ 13-21, 21-18, 21-14తో స్థానిక ఫేవరెట్‌, వరల్డ్‌ నెం.15 కొకి వతనబేను చిత్తు చేశాడు. వరల్డ్‌ నెం.13 సేన్‌కు ఈ సీజన్‌లో ఇది వరుసగా రెండో టైటిల్‌ కావడం విశేషం. గత నెలలో అతడు హైలో ఓపెన్‌ సూపర్‌ 500 టోర్నమెంట్‌లోనూ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. జపాన్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గడంతో బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌కు అర్హతకు సాధించేందుకు లక్ష్య అవకాశాలు మరింత మెరుగయ్యాయి.

ఇవి కూడా చదవండి:

బౌలర్లు పరిస్థితులకు తగ్గట్లు పోరాడి జట్టును గెలిపించారు: శ్రేయస్ అయ్యర్

డబ్ల్యూపీఎల్ 2027: ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే.. వేదిక మార్చిన బీసీసీఐ

Updated Date - Nov 16 , 2026 | 03:10 AM