భారత బ్యాటర్లు ఆటతీరును మెరుగుపరుచుకోవాలి: రవి శాస్త్రి
ABN , Publish Date - Nov 16 , 2026 | 06:58 AM
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకున్నప్పటికీ టీమిండియా బ్యాటింగ్ తీరుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ రవి శాస్త్రి స్పందించాడు. బ్యాటర్లు తమ ఆటతీరును మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకున్నప్పటికీ టీమిండియా బ్యాటింగ్ తీరుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా నాలుగో వన్డేలో భారత బ్యాటర్లు 89 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఐదో వన్డేలో విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకున్నా.. బ్యాటింగ్‌లో మాత్రం తేలిపోయారు. ఇదే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ రవి శాస్త్రి స్పందించాడు. బ్యాటర్లు తమ ఆటతీరును మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపాడు.
‘భారత బ్యాటర్ల ఆటతీరుపై గంభీర్ చేసిన వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తున్నా. 2027 వన్డే ప్రపంచ కప్ దక్షిణాఫ్రికాలో జరగనుంది. అక్కడి పిచ్‌లు కూడా ఇలాగే ఉంటాయని, ప్లేయర్లు ఇంకా మెరుగుపడాలని గంభీర్ ఆందోళన వ్యక్తం చేశాడు. గంభీర్ చెప్పింది అక్షరాలా నిజం. బ్యాటర్లు ప్రతి మ్యాచ్‌లోనూ 300+ పరుగుల లక్ష్యంతోనే ఆడాల్సిన అవసరం లేదు. బౌలర్లకు అనుకూలించే పిచ్‌లపై క్రీజులో నిలదొక్కుకుని వికెట్లు కాపాడుకోవడమే అత్యంత ముఖ్యం. కొన్ని పిచ్‌లపై 260-270 పరుగులు చేసినా విజయం సాధించే అవకాశం ఉంటుంది. కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు బ్యాటర్లు కొంత సమయం తీసుకుని ఆడాలి. షాట్ల ఎంపికతో పాటు బ్యాటింగ్ నైపుణ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవాలి’ అని రవి శాస్త్రి సూచించాడు.
ఇవి కూడా చదవండి:
బౌలర్లు పరిస్థితులకు తగ్గట్లు పోరాడి జట్టును గెలిపించారు: శ్రేయస్ అయ్యర్
డబ్ల్యూపీఎల్ 2027: ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే.. వేదిక మార్చిన బీసీసీఐ