భారత్‌లో 2031 వన్డే వరల్డ్ కప్
ABN , Publish Date - Nov 16 , 2026 | 03:01 AM
రెండు మెగా ఐసీసీ టోర్నమెంట్లకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈమేరకు ఆదివారం ఇక్కడ జరిగిన ఐసీసీ బోర్డు సమావేశం...
2029 చాంపియన్స్ ట్రోఫీ కూడా..
ఆమోదించిన ఐసీసీ
బాలి (ఇండోనేసియా): రెండు మెగా ఐసీసీ టోర్నమెంట్లకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈమేరకు ఆదివారం ఇక్కడ జరిగిన ఐసీసీ బోర్డు సమావేశం 2035 వరకు జరిగే టోర్నీలకు ఆమోద ముద్ర వేసింది. 2029 చాంపియన్స్ ట్రోఫీ (అక్టోబరు 9-28)కి భారత్‌ను వేదికగా ఎంపిక చేసింది. అలాగే 2031 వన్డే ప్రపంచ కప్ (అక్టోబరు 9-నవంబరు 23)నకు బంగ్లాదేశ్‌తో కలిసి భారత్ ఆతిథ్యమివ్వనుంది. 2029, 2031 ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు వేదికలుగా ఇంగ్లండ్‌ను ఖరారు చేసింది. 2030 టీ20 పురుషుల ప్రపంచ కప్‌ను ఇంగ్లండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్‌లలో నిర్వహించనున్నారు. 2031 తర్వాత జరిగే టోర్నీలకు ఆతిథ్య దేశాలను ఎంపిక చేయలేదు. కానీ ఆయా టోర్నమెంట్ల తేదీలను మాత్రం ఐసీసీ ప్రకటించింది. 2028 లాస్‌ఏంజిల్స్ ఒలింపిక్స్ పురుషుల క్రికెట్ క్వాలిఫయింగ్ టోర్నీ 2028 ఫిబ్రవరి ఐదు నుంచి 13 వరకు అమెరికాలో, మహిళల క్వాలిఫయింగ్ పోటీలు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 5 వరకు బంగ్లాదేశ్‌లో జరుగుతాయి.
ఇవి కూడా చదవండి:
బౌలర్లు పరిస్థితులకు తగ్గట్లు పోరాడి జట్టును గెలిపించారు: శ్రేయస్ అయ్యర్
డబ్ల్యూపీఎల్ 2027: ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే.. వేదిక మార్చిన బీసీసీఐ