Share News

పాక్‌ ఫ్యాన్స్‌ మద్దతు పలికారు

ABN , Publish Date - Nov 16 , 2026 | 02:57 AM

పాకిస్థాన్‌తో శనివారంనాటి ఆసియా కప్‌ అండర్‌-19 టోర్నీ ఫైనల్‌ సందర్భంగా ఆ దేశ ఫ్యాన్స్‌ తనకు మద్దతు పలికారని...

పాక్‌ ఫ్యాన్స్‌ మద్దతు పలికారు

తండ్రి సెహ్వాగ్‌తో ఆర్యవీర్‌

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌తో శనివారంనాటి ఆసియా కప్‌ అండర్‌-19 టోర్నీ ఫైనల్‌ సందర్భంగా ఆ దేశ ఫ్యాన్స్‌ తనకు మద్దతు పలికారని ఆర్యవీర్‌ సెహ్వాగ్‌ వెల్లడించాడు. ఫైనల్‌ నెగ్గిన అనంతరం టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తన కుమారుడు ఆర్యవీర్‌తో ఫోన్లో మాట్లాడాడు. ‘నేను బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో రెండువేల మంది పాక్‌ అభిమానులు స్టేడియంలో ఉన్నారు. వారంతా నాకు మద్దతు ప్రకటించడం అద్భుతంగా అనిపించింది. ఇక, భారత్‌ బ్యాటింగ్‌ చివరి ఓవర్లలో.. సీతారామ్‌, సీతారామ్‌, సీతారామ్‌ అని జపిస్తూ అద్భుతం జరగాలని కోరుకున్నా. ఆఖరి ఓవర్‌లో 8 రన్స్‌ కావాలి. బౌండరీ రావాలని ప్రార్థించా. అలాగే జరిగింది. జట్టు గెలిచింది’ అని ఆర్యవీర్‌ తన తండ్రికి వీడియోకాల్‌లో వివరించాడు. కాగా వీరేంద్ర సెహ్వాగ్‌ ఆడే రోజుల్లో అతడిని ముద్దుగా ‘సుల్తాన్‌ ఆఫ్‌ ముల్తాన్‌’గా ఫ్యాన్స్‌ పిలుచుకొనేవారు. 2004లో పాకిస్థాన్‌పై ముల్తాన్‌ టెస్ట్‌లో సెహ్వాగ్‌ ట్రిపుల్‌ సెంచరీతో కదం తొక్కడంతో అతడికి ఆ పేరు వచ్చింది.

ఇవి కూడా చదవండి:

బౌలర్లు పరిస్థితులకు తగ్గట్లు పోరాడి జట్టును గెలిపించారు: శ్రేయస్ అయ్యర్

డబ్ల్యూపీఎల్ 2027: ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే.. వేదిక మార్చిన బీసీసీఐ

Updated Date - Nov 16 , 2026 | 02:57 AM