Share News

వారెవ్వా.. ఆండ్రీవా

ABN , Publish Date - Nov 17 , 2026 | 04:17 AM

ఈ ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌తో కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ అందుకున్న రష్యన్‌ టెన్నిస్‌ తార మిర్రా ఆండ్రీవా మరోసారి...

వారెవ్వా.. ఆండ్రీవా

  • రష్యా స్టార్‌కు ‘డబ్ల్యూటీఏ’ టైటిల్‌

  • ఫైనల్లో స్విటోలినాపై విజయం

ఇండియన్‌ వెల్స్‌ (యూఎస్ఏ): ఈ ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌తో కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ అందుకున్న రష్యన్‌ టెన్నిస్‌ తార మిర్రా ఆండ్రీవా మరోసారి అదిరిపోయే ప్రదర్శన చేసింది. సీజన్‌ ముగింపు టోర్నీ, ప్రతిష్టాత్మక డబ్ల్యూటీఏ ఫైనల్స్‌ ట్రోఫీ గెలుచుకొని సంచలనం సృష్టించింది. మహిళల సింగిల్స్‌ తుదిపోరులో 19 ఏళ్ల అండ్రీవా 7-5, 6-3తో 32 ఏళ్ల ఎలినా స్విటోలినా (ఉక్రెయిన్‌)ను వరుససెట్లలో చిత్తుచేసి తొలిసారి ఈ మెగా టోర్నీ విజేతగా నిలిచింది. టోర్నీ ఆద్యంతం ఒక్క సెట్‌ కూడా కోల్పోని ఆండ్రీవా ఫైనల్లోనూ అదే జోరు చూపడం విశేషం. ఇక, 2004లో షరపోవా తర్వాత ఈ టైటిల్‌ నెగ్గిన పిన్న వయస్కురాలిగా రికార్డుకెక్కిన ఆండ్రీవా.. తాజా ప్రదర్శనతో ర్యాంకింగ్స్‌లో ఓ స్థానం ఎగబాకి ప్రపంచ రెండో ర్యాంకర్‌గా అవతరించింది.. ఆండ్రీవాకు ట్రోఫీతో పాటు ప్రైజ్‌మనీ రూపంలో రూ. 31.65 కోట్లు దక్కింది. మహిళల డబుల్స్‌ టైటిల్‌ను కాటరీనా సినియకోవా/టేలర్‌ టౌన్‌సెండ్‌ జోడీ సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి:

ఐసీసీ ఛైర్మన్‌గా జై షా పునర్నియామకం

ధోనీని గుర్తు చేశాడు.. మోహిత్ ఉల్వాపై సునీల్ గావస్కర్ ప్రశంసల వర్షం

Updated Date - Nov 17 , 2026 | 04:17 AM