సీపీఎస్ రద్దు చేసి..ఓపీఎస్ పునరుద్ధరించండి
ABN , Publish Date - Nov 17 , 2026 | 06:53 AM
రాష్ట్రంలో సీపీఎస్ రద్దు చేసి.. పాత పింఛను విధానాన్ని అమలు చేయాలని, ఇందుకోసం తక్షణం కమిటీని ఏర్పాటు చేయాలని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి డిమాండ్ చేశారు.
ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి
రాష్ట్రంలో సీపీఎస్ రద్దు చేసి.. పాత పింఛను విధానాన్ని అమలు చేయాలని, ఇందుకోసం తక్షణం కమిటీని ఏర్పాటు చేయాలని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. గతంలో సీపీఎస్ నుంచి ఓపీఎ్సకు మార్చే అంశంపై ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రభుత్వం చర్చలు జరిపి, ఈ అంశంపై కమిటీని ఏర్పాటు చేసేందుకు హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. సీపీఎస్ విధానం ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడం లేదన్నారు.
ఇంటర్మీడియట్ బోర్డును పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసే ప్రతిపాదన నేపథ్యంలో ఆ బోర్డులో పని చేస్తున్న బోధన, బోధనేతర ఉద్యోగుల ప్రయోజనాలకు భరోసా కల్పించాలని కోరారు. ఉద్యోగులకు సంబంధించిన 41 డిమాండ్లపై తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుతున్నట్లు తెలిపారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులకు గత నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న కరువు భత్యం బకాయిలను వెంటనే వారి వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయాలని ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల సైదులు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీతో సీఎం రేవంత్రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల
సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News