Share News

ఐపీఎల్ 2027: గుజరాత్ జట్టులో చేరిన ఎస్ఆర్‌హెచ్ స్టార్ బౌలర్

ABN , Publish Date - Nov 17 , 2026 | 02:02 PM

ఐపీఎల్ 2027కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు స్టార్ పేసర్ హర్షల్ పటేల్‌ను రిలీజ్ చేసింది. గుజరాత్ టైటాన్స్‌తో రూ.4 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది.

ఐపీఎల్ 2027: గుజరాత్ జట్టులో చేరిన ఎస్ఆర్‌హెచ్ స్టార్ బౌలర్
Harshal Patel

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2027కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు స్టార్ పేసర్ హర్షల్ పటేల్‌ను రిలీజ్ చేసింది. గుజరాత్ టైటాన్స్‌తో రూ.4 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో హర్షల్ పటేల్ వచ్చే సీజన్‌లో గుజరాత్ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఇరుజట్ల మధ్య ట్రేడ్‌లో భాగంగా ఈ బదిలీ జరిగింది. కాగా 2025 ఐపీఎల్ వేలంలో ఎస్ఆర్‌హెచ్ జట్టు హర్షల్ పటేల్‌ను రూ.8కోట్లు పెట్టి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.


ఐపీఎల్‌లో హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో ఉత్తమ ప్రదర్శనతో రెండు సార్లు పర్పుల్‌ క్యాప్‌ విజేతగా నిలిచాడు. 2025 సీజన్‌లో 13 మ్యాచుల్లో 16 వికెట్లు తీసి ఆకట్టుకున్న హర్షల్.. 2026 ఐపీఎల్ సీజన్‌లో మాత్రం ఐదు మ్యాచ్‌లే ఆడి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. గత సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్‌ యువ సంచలనాలు ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ అద్భుత ప్రదర్శనలతో చెలరేగడంతో హర్షల్‌కు అవకాశాలు రాలేదు. వచ్చే సీజన్‌లో గుజరాత్‌ జట్టులో అయినా హర్షల్‌కు అవకాశాలు దక్కుతాయా? లేదా? అనేది చూడాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి:

ముద్దంటూ విదేశీయురాలిని వేధించిన వ్యక్తి.. కట్ చేస్తే జైల్లో..

అమితాబ్, అభిషేక్ బచ్చన్‌ల హత్యకు 200 మంది సిద్ధం.. గోల్డీ ధిల్లాన్ మరోసారి బెదిరింపులు..

Updated Date - Nov 17 , 2026 | 02:19 PM