Share News

ఐపీఎల్‌ మ్యాచ్‌..ఉప్పల్‌ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

ABN , Publish Date - Apr 18 , 2026 | 08:16 AM

ఈ నెల 18, 21, మే 3, 6, 22 తేదీల్లో ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో నిర్వహించే ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలను అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఐపీఎల్‌ మ్యాచ్‌..ఉప్పల్‌ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు
Uppal stadium, IPL

హైదరాబాద్‌ సిటీ: ఈ నెల 18, 21, మే 3, 6, 22 తేదీల్లో ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో నిర్వహించే ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలను అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. క్రికెట్‌ మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో లారీలు, డంపర్లు, ఎర్త్‌మూవర్స్‌, ట్రక్కులు, టిప్పర్లు, వాటర్‌ ట్యాంకర్లు, ఆర్‌ఎంసీ వాహనాలు, జేసీబీలు, ఐచర్‌ వ్యాన్లు, ప్రైవేటు బస్సులు, ట్రాక్టర్లు స్టేడియం పరిసరాల్లోకి అనుమతించరని పేర్కొన్నారు.


city3.2.jpgఈ నెల 18 మ్యాచ్‌ సందర్భంగా మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 12 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. నాగోల్‌ నుంచి హబ్సిగూడ, బోడుప్పల్‌ నుంచి అంబర్‌పేట్‌ వెళ్లే మార్గాల్లో వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న కారణంగా ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు. పాస్‌లు ఉన్నవారి వాహనాలు మాత్రమే స్టేడియంలోపల పార్కింగ్‌ చేయాలని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అక్షయ తృతీయకు ముందు గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం, వెండి

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 18 , 2026 | 08:39 AM