Share News

రేవంత్‌తో పయ్యావుల భేటీ

ABN , Publish Date - Apr 18 , 2026 | 05:00 AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాజ్యసభ ఎంపీ వేం నరేందర్‌రెడ్డిని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌, పొన్నూరు ఎమ్మెల్యే ..

రేవంత్‌తో పయ్యావుల భేటీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాజ్యసభ ఎంపీ వేం నరేందర్‌రెడ్డిని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్యసభ సభ్యుడిగా ఇటీవల ఎన్నికైన వేం నరేందర్‌రెడ్డికి శుక్రవారం పార్లమెంటు లాబీలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు, కేంద్ర మంత్రులు సీఆర్‌ పాటిల్‌, కింజరాపు రామ్మోహన్‌నాయుడితో శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, మంత్రి పయ్యావుల, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర భేటీ అయ్యారు.

Updated Date - Apr 18 , 2026 | 05:00 AM